సోషల్ మీడియా పుణ్యమా అంటూ చిన్న చిన్న వీడియోస్ ని షేర్ చేసుకునే వాళ్ళు కూడా తెగ పాపులర్ అయిపోతున్నారు. సోషల్ మీడియా ద్వారా మోటివేటర్ వంశీ బాగా ఫేమస్ అయిపోయాడు. ఈయన యూట్యూబ్ లో మోటివేషనల్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. వంశి వీడియోస్ ని లక్షల మంది ఫాలో అవుతూ ఉంటారు. ఇది వరకు త్వరలో తన భార్యతో విడాకులు తీసుకుంటాడని వార్తలు వచ్చాయి. జనవరి 17న తన భార్య తో పరస్పర అంగీకారం తో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు వంశీ.
Advertisement
Advertisement
మేము హ్యాపీగానే విడిపోదామనుకున్నాం అలానే విడిపోయాం సంతోషంగా ఉన్నప్పుడు కలిసి ఉన్నాం. హ్యాపీగా లేము అనుకున్నప్పుడు ఇక కలిసి ఉండడం అనేది తప్పు. అందుకే విడిపోయామని వంశీ తాజాగా చెప్పుకొచ్చాడు. నిజానికి నేను పబ్లిక్ కి చెప్పినప్పుడు అడ్జస్ట్ అవ్వండి. సారీ చెప్పండి కలిసిపోండి అని చెప్పాను కానీ సంతోషంగా లేనప్పుడు కలిసి ఉండకూడదు. దీనివలన ఎదుటివాళ్లు బాధపడతారు వారి లైఫ్ కూడా బాగుండాలి కదా అందుకే హ్యాపీగా విడిపోదామనుకున్నామని వంశీ విడాకుల గురించి చెప్పాడు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!