Home » ఈ 5 వాసనలను చూస్తే దోమలు తట్టుకోలేవు.. పారి పోవడం ఖాయం..?

ఈ 5 వాసనలను చూస్తే దోమలు తట్టుకోలేవు.. పారి పోవడం ఖాయం..?

by Sravanthi
Ad

ప్రస్తుతం వానాకాలం సీజన్ నడుస్తుంది. విపరీతంగా వానలు దంచి కొడుతున్నాయి. ఈ తరుణంలో చెరువులు కుంటలు ఎక్కడైనా వాన నీళ్లతో నిండిపోతాయి. అలాగే మన పరిసరాల్లో కూడా చిన్న చిన్న కుండలు లేదంటే చిన్న చిన్న మోరీలు కాలువలు వర్షపు నీటితో నిండి దోమలకు ఆవాసాలుగా మారతాయి. దీంతో దోమలు అక్కడ నివాసం ఉండి వాటి ప్రాబల్యాన్ని పెంచుకుని మన పై దాడులు చేసి అనారోగ్యాలకు గురి చేస్తాయి. మరి అలాంటి దోమలు మనల్ని కుట్టకుండా ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే..?

పుదీనా ఆకులు: పుదీనా ఆకులను మనం వంటకాలలో, మరియు కొన్ని రకాల పానీయాలలో ఉపయోగిస్తాం. ఈ పుదీనా ఆకుల నుండి తయారైన నూనె వాసన దోమలను దూరంగా ఉంచుతుంది

Advertisement

వేపాకులు : సాధారణంగా వేపాకులు ఆయుర్వేదం గా ఎంతో ఉపయోగపడతాయని అంటారు. అలాగే దోమలకు కూడా వేప వాసన అనేది పడదు. వేప నూనె చేతులకు కాళ్ళకు రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దోమలు ఆ వాసనకు దూరంగా ఉంటాయి.

Advertisement

వెల్లుల్లి : వెల్లుల్లి నుంచి వచ్చే ఘాటైన వాసనకు దోమలు తట్టుకోలేవు. అలాగే వెల్లుల్లిని ఎక్కువగా తినేవారినీ దోమలు ఎక్కువ కుట్టవు.

లెమన్ గ్రాస్ : దీని సారం నుంచి తయారైనటువంటి నూనె వాసన దోమల్ని దూరంగా ఉంచుతుంది.తులసి ఆకు : తులసి ఆకుల యొక్క వాసనను దోమలు ఇష్టపడవు. కాబట్టి తులసి చెట్టు ఇంటి ఆవరణలో పెంచుకుంటే దోమల బారి నుండి తప్పించుకోవచ్చు.

ALSO READ;

ఆకాష్ పూరి పై ఆసక్తికర కామెంట్స్ చేసిన బండ్ల గణేష్.. ఏమన్నారంటే..?

కాకి కాలజ్ఞాని అంటారు.. ఎందుకో తెలుసా..?

 

Visitors Are Also Reading