Home » మంకీ మ్యాన్ ట్రైలర్.. అదిరిపోయింది.. చూసారా..?

మంకీ మ్యాన్ ట్రైలర్.. అదిరిపోయింది.. చూసారా..?

by Sravya
Ad

హనుమాన్ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఒక సాధారణ మనిషికి సూపర్ పవర్ వస్తే ఎలా ఉంటుందనేది సినిమాలో చూపించారు. దాదాపు అటువంటి కథతోనే హాలీవుడ్ సినిమా మంకీ మ్యాన్ కూడా తెర మీదకి రాబోతోంది. దేవ్ పటేల్ నటిస్తూ దర్శకత్వం వహించిన మంకీ మ్యాన్ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. పేదవారిని కాపాడే హీరోగా తనని తాను భావిస్తూ హనుమంతుని స్ఫూర్తితో ముందుకు వెళ్లే హీరో కథ ఇది. మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెర మీదకి వస్తోంది.

Advertisement

Advertisement

గత రెండేళ్ల నుండి మంకీ మ్యాన్ సినిమా షూటింగ్ చేస్తున్నారట. దేవ్ పటేల్ సినిమాని డైరెక్ట్ చేయడంతో పాటుగా స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా తానే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది నా చిన్నతనంలో మా అమ్మ నాకు ఒక కథ చెప్పేది అంటూ హీరో చెప్పిన డైలాగ్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. పైగా బ్యాక్ గ్రౌండ్ లో హనుమంతుని ఫోటోలు కూడా కనబడతాయి. మంకీ మాన్ సినిమాలో దేవ్ పటేల్ పక్కన శోభిత దూళిపాళ నటిస్తున్నారు ఈ సినిమాలో హీరో ఒక వెయిటర్ గా కనబడబోతున్నారు. శోభిత బార్ డాన్సర్ గా మెప్పించబోతున్నారు 2024 ఏప్రిల్ 5 న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading