నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలకృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇతను త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. దీంతో నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం తెగ ఎదురుచూస్తున్నారట. ఏ సినిమాతో ముందుకు వస్తాడు? ఎలాంటి కాన్సెప్ట్ తో రాబోతున్నాడు? ఏ దర్శకుడుతో సినిమా చేయడానికి మోక్షజ్ఞ ఆసక్తి చూపుతున్నాడు? అనే విషయాలపై ప్రేక్షకుల్లో సందడి నెలకొంది.
ఇకపోతే మోక్షజ్ఞ ఒకప్పుడు హీరోల అస్సలు ఉండేవాడు కాదు. ఒక హీరోకి సరిపోయే క్వాలిటీస్ తనలో ఒక్కటి కూడా ఉండేది కాదు. చాలా లావుగా, బరువుతో ఉండేవాడు. దీంతో అభిమానులు మోక్షజ్ఞకి సినిమాలపై ఆసక్తి లేదు అని అనుకున్నారు. ఇకపోతే ఇప్పుడు తాజాగా మోక్షజ్ఞ ఇంస్టాగ్రామ్ లో చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఒక హీరో అంటే ఎలా ఉండాలో దానికి తగిన క్వాలిటీస్ తో మోక్షజ్ఞ కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే వారి మేనత్త కూతురు వివాహానికి మోక్షజ్ఞ హాజరయ్యారు.
ఈ వివాహంలో భాగంగా నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఈ వివాహానికి దగ్గరుండి మరి మేనమామలుగా వారు చేయాల్సిన పనులను దగ్గరుండి చేశారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ ఇంస్టాగ్రామ్ లో తాను పంచుకున్న ఫోటోలలో భాగంగా తన అన్నలైనటువంటి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వీరిద్దరితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ “నా ప్రియమైన అన్నయ్యలు” అనే క్యాప్షన్ కూడా జత చేశాడు. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలకృష్ణ లాగా మోక్షజ్ఞ కూడా ఒక పవర్ఫుల్ యాక్టర్ గా కనిపించాలని నందమూరి అభిమానులు ఆశ పడుతున్నారు.