డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఎక్కడ కనిపించినా ఏం మాట్లాడినా దాసరి నారాయణరావును తలుచుకుంటూ ఉంటారు. నా గురువుగారు దేవుడు దాసరి అంటూ కొనియాడతారు. నిజానికి మోహన్ బాబు దాసరిని గుండెల్లో పెట్టుకోవడానికి ఓ కారణం కూడా ఉంది. మోహన్ బాబుకు సినిమా అవకాశాలు ఇచ్చిందే దాసరి నారాయణ రావు. అంతే కాకుండా అసలు మోహన్ బాబుకు ఆ పేరు పెట్టింది కూడా దాసరి నారాయణ రావు కావడం చెప్పుకోతగ్గ విషయం.
Advertisement
మోహన్ బాబు అసలు పేరు భక్త వత్సలం….ఆయన మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవారు. అయితే దాసరినారాయణ రావు స్వర్గం నరకం అనే సినిమాను అందరూ కొత్తవాళ్లతో తీయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలను అనుకోగా మొదటి హీరోగా విశ్వేశ్వరరావుకు అవకాశం ఇచ్చారు. ఇక రెండో హీరోగా మోహన్ బాబను అనుకున్నారు.
Advertisement
అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థ డిస్ట్రిబ్యూటర్ లు వ్యవహరిస్తున్న లక్ష్మీ ఫిలింస్ వాళ్లు బోసు బాబు అనే ఓ యుడకుడిని పంపించి స్వర్గం నరకం లో అతడిని హీరోగా తీసుకోవాలని ఆదేశించారు. అప్పుడు డిస్ట్రీబ్యూటర్ లు చెప్పిందే వేదం..దాంతో దాసరి అంతర్మతనంలో పడిపోయారు. ఏం చేయాలో తోచని స్థితిలో ఉండగా దాసరి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన రవిరాజా పినిశెట్టి తన గురువు దాసరికి ఓ ఐడియా ఇచ్చాడు.
ఇద్దరితో ఆడిషన్స్ చేద్దామని ఎవరు బాగుంటే వాళ్లను తీసుకుందామని చెప్పారు. అలా చేయగా మోహన్ బాబు నటన ముందు బోసు బాబు నటన బోసిపోయింది. దాంతో మోహన్ బాబు స్వర్గం నరకం సినిమాతో హీరో అయ్యాడు. అయితే ఆ బోసుబాబు కూడా ఎవరోకాదు. ఆయన ప్రముఖ వ్యాపరవేత్తగా ఎదిగాడు. ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఎస్వీఆర్ ట్రావెల్స్ యజమానే ఆ బోసు బాబు.