ఇండియన్ క్రికెట్ టీం లో ఎక్కువగా వినపడుతున్న పేరు కచ్చితంగా మహమ్మద్ సిరాజ్ నిన్న ఏషియా కప్ ఫైనల్లో ప్రదర్శన అలాంటిది మరి. ఆరు వికెట్లు తీసి ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. కానీ మ్యాచ్ కి ముందు మ్యాచ్ తర్వాత తాను చేసిన పనులు కోట్లదిమంది ప్రేక్షకుల మనసులను గెలిచాయి. మ్యాచ్ మొదలవ్వడానికి ముందు గ్రౌండ్స్ మెన్ తో ఫోటోలు దిగాడు. వీళ్లంతా ప్రేమదాస స్టేడియం గ్రౌండ్స్ మెన్స్. టోర్నిలో వారు పడిన కష్టాన్ని గుర్తించి ఇలా వారితో కలిసి ఫోటో దిగాడు.
ఇక శ్రీలంక బ్యాటింగ్ను కుప్పకూల్చిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అవార్డు మొత్తం 5 వేల యుఎస్ డాలర్లు అంటే 4 లక్షల రూపాయల కన్నా ఎక్కువ. ఈ మొత్తాన్ని శ్రీలంక గ్రౌండ్స్ స్టాప్ కు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు. ఎంత మంచి పని చేశాడో కదా. ఎందుకో కూడా చెప్పుకుందాం. ఈ టోర్నమెంట్ అంతా వర్షం ఆటంకం కలిగిస్తూనే ఉంది. కవర్స్ తీసుకురావడం, మళ్ళీ కవర్స్ ను తొలగించడం గ్రౌండ్స్ మెన్స్ చాలా ఎక్కువ కష్టపడ్డారు.
Advertisement
Advertisement
అందుకే ఇలా తన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మొత్తాన్ని వారికి ఇచ్చేసి సిరాజ్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. మరోవైపు మ్యాచ్ జరుగుతుండగానే ఏసీసీ ప్రెసిడెంట్ జైశా కూడా శ్రీలంక గౌడ్స్ మెన్స్ కోసం ప్రత్యేక రివార్డును ప్రకటించాడు. క్యాండీ కొలంబోలో పనిచేసిన గ్రౌండ్స్ మెన్స్ కోసం 50వేల యుఎస్ డాలర్లు అంటే సుమారుగా 41 లక్షల రూపాయలను అనౌన్స్ చేశాడు. ఈ రెండు చర్యలు చూసిన తర్వాత సోషల్ మీడియాలో సిరాజ్ పై, జైషాపై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
- నారా లోకేష్ మెడకు ఫైబర్ నెట్ స్కాం… నారా బ్రాహ్మణినికి టిడిపి బాధ్యతలు ?
- రతిక నా కొడుకుని వాడుకుంది…పెళ్లి చేస్తా.. పల్లవి ప్రశాంత్ అమ్మ షాకింగ్ కామెంట్స్…!
- Babar Azam : పాక్ డ్రెస్సింగ్ రూంలో పెద్ద గొడవ.. పచ్చి బూతులు తిట్టిన బాబర్ ?