బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేసింది. నాగపూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో సమిష్టిగా రాణించిన టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో భారత స్పిన్నర్లు అశ్విన్ జడేజా అదరగొట్టారు. భారత బౌలర్ల దాటికి ఆసీస్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. 243 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 91 పరుగులకే కుప్పకూలింది.
Advertisement
Advertisement
దీంతో టీమ్ ఇండియా 1-0 తేడాతో ముందంజలోకి వచ్చింది. అయితే, ఈ మ్యాచ్ తో షమీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పైగా టీమిండియా మాజీ కెప్టెన్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీని దాటేశాడు. ఒక కోహ్లీనే కాదు ప్రస్తుతం ఉన్న హేమా హేమీ బ్యాటర్లు కేఎల్ రాహుల్, పూజారులు సైతం షమీ ముందు చిన్నబోయారు. ఇంతకు షమి ఎలాంటి రికార్డు సాధించారంటే,
టెస్ట్ క్రికెట్ లో కోహ్లీ కంటే కూడా ఎక్కువ సిక్స్ లు కట్టిన బ్యాటర్ గా నిలిచాడు. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్న నిజం. టెస్టుల్లో కోహ్లీ కంటే షమీనే ఎక్కువ సిక్స్ లు కొట్టాడు. ఇప్పటివరకు 105 టెస్టులు ఆడిన కోహ్లీ, 8131 పరుగులు, 27 సెంచరీలు, 7 డబల్ సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు చేసినా, సిక్స్ లు మాత్రం 24 కొట్టాడు. 60 టెస్టులు ఆడి 685 రన్స్ మాత్రమే చేసిన షమీ 25 సిక్సులు బాదాడు.
READ ALSO : Veera Simha Reddy : “వీర సింహారెడ్డి” ఓటీటీ ముహుర్తం ఫిక్స్..ఎందులో స్ట్రీమింగ్ అంటే ?