పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అత్తారింటికి దారేది. గబ్బర్ సింగ్ తరవాత మళ్లీ పవన్ ఈ సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ కు జోడీగా సమంత నటించింది. ఈ సినిమా నర్జియా ముఖ్యమైన అత్త పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాలో కామెడీ, ఎమోషనల్ సీన్లు ఓ రేంజ్ లో ఉంటాయి.
Advertisement
సినిమాలోని క్లైమాక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..ఆ సీన్ లో పవన్ కల్యాణ్ తన అత్తను ఇంటికి రావాలంటూ కొట్టే డైలాగులకు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. అంతే కాకుండా ప్రతి సీన్ కూడా ఎంతో వినోదాత్మకంగా ఉంటుంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ సినిమాల్లో ఎన్నో లాజిక్ లు ఉంటాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాలో ప్రతి సీన్ లో లాజిక్ లు కనిపిస్తుంటాయి.
Advertisement
కానీ అత్తారింటికి దారేది సినిమాలో మాత్రం త్రివిక్రమ్ ఓ లాజిక్ ను మిస్ అయ్యారు. ఆ లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం…పవన్ కల్యాణ్ ఫ్రస్టేషన్ లో ఉన్న సమయంలో కమెడియన్ అలీ వచ్చి సిగరెట్ తీసుకురావాలని కోరుతాడు. అప్పటి వరకూ పవన్ ను అలీ డ్రైవర్ అనుకుంటాడు. దాంతో అప్పటికే ఇంట్లో గొడవ జరిగి ఫ్రస్టేషన్ లో ఉన్న పవన్ అలీని చితకబాదుతాడు.
ఆ తరవాత పాపం అనిపించి పిలిచి డబ్బులు ఇస్తాడు. ఏకంగా సూట్కేస్ చేతిలో పెట్టి ఇందులో ఎంత ఉందో తెలియదు తీసుకుపో అని చెబుతాడు. అప్పటికే ఎం ఎస్ నారాయణ సూట్కేస్ ను ఓపెన్ చేసి పవన్ కు ఇస్తాడు. పూర్తిగా ఓపెన్ చేయకుండా దాని లాక్ ను అన్ లాక్ చేసినట్టు క్లియర్ గా కనిపిస్తుంది. కానీ అలీ ఆ సూట్కేస్ పక్కకు తీసుకెళ్లి దీని తాళం ఇవ్వలేదు అని అడుగుతాడు. దాంతో పవన్ అప్పటికే తెలిరి ఉన్న సూట్కేస్ ను సుత్తితో పగటగొట్టి అలీ చేతిలో ఒక నోట్ల కట్ట మాత్రమే పెడతాడు. కాగా అల్రెడీ లాక్ తీసి ఉన్న సూట్కేస్ ను పగలగొట్టడం ఏంటి..ఇదెక్కడి లాజిక్ త్రివిక్రమ్ గారూ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.