Home » Miss Perfect Web Series Review : మిస్ పర్ఫెక్ట్ కథ, రివ్యూ అండ్ రేటింగ్..!

Miss Perfect Web Series Review : మిస్ పర్ఫెక్ట్ కథ, రివ్యూ అండ్ రేటింగ్..!

by Sravya
Ad

లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్న తర్వాత లావణ్య చేసిన మొదటి వెబ్ సిరీస్ ఇది. ప్రస్తుతం ఓటిటిలోకి వచ్చింది ఇది. కామెడీ వెబ్ సిరీస్ గా దీన్ని రూపొందించారు. జనవరి 22న ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. బిగ్బాస్ ఫేమ్ అభిజిత్ ఈ సిరీస్ లో మరొక ప్రధానమైన పాత్ర చేసారు. లావణ్య త్రిపాఠి స్కూల్ టాపర్, క్లాస్ అంబాసిడర్, టీచర్ ఫేవరెట్, నాకు క్లీనింగ్ అంటే ఇష్టం క్లీనింగ్ గురించి ప్యాషన్ ఉంది అని ట్రైలర్ లో లావణ్య త్రిపాఠి చెప్పడం చూసే వుంటారు. మేనేజ్మెంట్ కన్సల్టెంట్ లావణ్య రావు అనే పాత్రని ఈమె పోషిస్తోంది.

లావణ్య ని ప్రేమించే యువకుడు రోహిత్ పాత్రలో అభిజిత్ నటించాడు. ఈ వెబ్ సిరీస్ లో లావణ్యకి శుభ్రత అంటే ప్రాణం. అభిజిత్ మాత్రం శుభ్రత ని పట్టించుకోడు. ఫైనల్ గా వీళ్ళు లవ్ లో పడతారు. ఒకరంటే ఒకరు కి ఇష్టము. తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాలి. ఈ సిరీస్ కథ రివ్యూ వచ్చేసాయి. చూసేయండి.

Advertisement

కథ, వివరణ:

Advertisement

కథ విషయానికి వచ్చేస్తే.. లావణ్య రావు (లావణ్య త్రిపాఠి) స్వచ్ఛ భారత్‌కి బ్రాండ్ అంబాసిడర్ లాగ. ఈమె కి క్లీనింగ్ అంటే ఇష్టం. ఈమె కి ప్రమోషన్ వచ్చాక హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది. ఫ్లాట్‌లోకి వంట చేయడానికి జ్యోతి (అభిజ్ఞ) వస్తుంది. లావణ్య గేటెడ్ కమ్యూనిటీ లో రోహిత్ (అభిజీత్) ఫ్లాట్‌ లో కూడా జ్యోతి పని చేస్తుంది. ఇక కరోనా కారణంగా పనికి రాలేనని చెప్తుంది. ఆ విషయం రోహిత్‌ కి చెప్పమని రిక్వెస్ట్ చేస్తుంది. జ్యోతి మరొకర్ని పంపిందని అనుకుంటాడు రోహిత్.

లావణ్య అసలు విషయం చెబుదామని అనుకుంటుంది. కానీ ఫ్లాట్ అంతా చిందరవందరగా ఉండటం చూసి క్లీన్ చేస్తుంది. ప్రతి రోజూ ఇలానే జరుగుతూ ఉంటుంది. లక్ష్మీ ని చూసి రోహిత్ లవ్ చేస్తాడు. లక్ష్మికి ఇష్టమైనవి వండి పెడుతూ ఉంటాడు. మనిషిగా వచ్చేది లావణ్య అని రోహిత్ తెలుసుకున్నాడా…? తన ప్రేమ విషయం చెప్పాడా..? లేదా…? ఏమైందో తెలియాలంటే చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

కథ
నటీనటులు
సినిమాటోగ్రఫీ
ప్రొడక్షన్ డిజైన్

మైనస్ పాయింట్స్:

సాగతీత సన్నివేశాలు

రేటింగ్: 2.75/5 

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading