సీతక్క గురించి తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పేరు సుపరిచితమే. ఈమె అసలు పేరు ధనసరి అనసూయ సీతక్క. సీతక్కగా అందరికీ ఈమె సుపరిచితం. ఈమె వయసు 52 సంవత్సరాలు. పొలిటికల్ సైన్స్ లో ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు.
Advertisement
గతంలో జనశక్తి గ్రూపులో దళ సభ్యురాలుగా ఉండేవారు ప్రేమించిన శ్రీరాముని పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడిపోయారు. సుమారు రెండు దశాబ్దాలు పట్టు మావోయిస్టు పార్టీలో పనిచేశారు.
Advertisement
సీతక్క జనజీవని స్రవంతిలోకి వచ్చేసారు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి చదివారు. తెలుగుదేశం పార్టీ తరఫున 2004లో ములుగు నుండి పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2009లో వీరయ్య పై గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేశారు. కానీ టిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు 2018లో సీతక్క కాంగ్రెస్ పార్టీలో చేరారు. ములుగు నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
కరోనా టైం లో సీతక్క మారుమూల పల్లెకి కూడా వెళ్లి ఆహార పదార్థాలు ఇచ్చేవారు. ఈ ఏడాది జూలైలో తెలంగాణని ముంచెత్తిన వానకి ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కొండాయి గ్రామమంతా వరద నీటితో మునిగిపోయింది. సీతక్క చూడలేకపోయారు ఈ గ్రామ ప్రజలను రక్షించడానికి హెలికాప్టర్ పంపాలని కన్నీరు పెట్టుకున్నారు. ఈమె తాజాగా తెలంగాణలో కొలువుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి పొందారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!