తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశంపై చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, సీఎం లు స్పందిస్తున్నారు. ఈ తరుణంలోనే.. నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇవాళ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్టుపై స్పందించిన మంత్రి కేటీఆర్… ఏపీ రాజకీయాలకు,తెలంగాణతో సంబంధమేంటి ? అని ప్రశ్నించారు.
Advertisement
ఇక్కడ ర్యాలీలు ఎందుకు ఏపీలో చేసుకోండని… రాజమండ్రిలో భూమి దద్దరిల్లేలా ర్యాలీలు చేసుకోండంటూ తెలుగుదేశం పార్టీ నేతలకు చురకలు అంటించారు కేటీఆర్. ఏపీలో జరుగుతుంది రెండు పార్టీల మధ్య ఘర్షణ.. దానికి మేము స్పందించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. “బైగాని షాదీ మే అబ్దుల్లా దీవానా” అన్నట్లు చంద్రబాబు ఆంధ్ర లో అరెస్ట్ అయితే అక్కడ ధర్నాలు చేయాలి కానీ ఇక్కడ ధర్నాలు చేస్తే ఎలా ? పక్కింట్లో పంచాయితీ అయితే ఇక్కడ తీర్చుకుంటాం అంటే ఎలా ? అంటూ సెటైర్లు పేల్చారు.
Advertisement
వీరు చేశారని ఇంకొకరు చేస్తే హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు కాపాడవలసిన బాధ్యత మా మీద ఉందని హెచ్చరించారు. హైదరాబాద్లో ఇక్కడ అందరూ పదేళ్ల నుండి ప్రశాంతంగా ఉన్నారు.. లేని చిచ్చు పెడతమంటే ఎలా అని నిలదీశారు. ఓ ఫ్రెండ్ ద్వారా లోకేష్ ఫోన్ చేసి ర్యాలీలు ఎందుకు అడ్డుకుంటున్నారు అని అడిగారని చెప్పిన కేటీఆర్… తెలంగాణ ఉద్యమంలోనే ఐటీ ఆక్టివిటీ దెబ్బతినకూడదు అనిఐటీ కారిడార్లో ర్యాలీ చేయలేదని గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి
- టీడీపీకి షాక్.. ఏ14గా నారా లోకేష్..ఇక అరెస్ట్ తప్పదా ?
- జడేజాపై చేయి చేసుకున్న వార్నర్… BJP నేత సీరియస్ !
- చిరంజీవి తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో.. 650 కోట్ల నష్టం ?