ఆచార్య చాణక్యుడు ప్రజలకు ఎన్నో గొప్పవిషయాలను నేర్పించాడు. ఆర్థిక, రాజకీయ, కుటుంబ ఇలా ఆయన చెప్పని ఆయనకు అవగాహన లేని విషయం అంటూ లేదు. ప్రస్తుతం చాలా మంది ఆర్థికవేత్తలు…మనో వైజ్ఞానిక నిపుణులు ఉన్నారు. కానీ ఆచార్య చాణక్యుడి నీతికి ఇప్పటి వరకూ క్రేజ్ ఉంది. చాలా మంది చాణక్య నీతిని పాటిస్తున్నారు. చాణక్యనీతి గ్రంథానికి ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Advertisement
ఇక చాణక్య నీతిలో మహిళలు పురుషుల స్వభావాల గురించి కూడా ఎన్నో విషయాలను చెప్పాడు. ఈ క్రమంలోనే మహిళలకు కొన్ని లక్షణాలు ఉంటే కొంతమంది పురుషులు సులభంగా తల వంచుతారని చాణక్యనీతిలో వెల్లడించారు. ధైర్యం గల స్త్రీలను పురుషులు ఎక్కువగా ఇష్టపడతారని చాణక్యుడు చెప్పాడు. ధైర్యం గల స్త్రీలను పెళ్లి చేసుకోవాలని అనుకుంటారని పేర్కొన్నారు.
Advertisement
అంతే కాకుండా సహనం కలిగిన స్త్రీలను కూడా పురుషులు ఎక్కువగా ఇష్టపడతారని చాణక్య నీతి చెబుతోంది. భూదేవి కూడా ఓ స్త్రీ…కాబట్టి భూదేవి అంత సహనం మహిళలలో ఉండాలని అలాంటి మహిళల కోసం పురుషులు ఏమైనా చేస్తారని పేర్కొన్నారు. తమ ధర్మాన్ని ఆచరించే స్త్రీలను పురుషులు ఎక్కువ ప్రేమిస్తారని చాణక్యుడు చాణక్యనీతిలో పేర్కొన్నాడు.
భక్తి ఉన్న స్త్రీలు తమ పూజలను తరచుగా చేయాలని పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రశాంతంగా ఉండే స్త్రీలకు పురుషులు ఇష్టపడతారని చాణక్యనీతిలో పేర్కొన్నాడు. ప్రశాంతంగా ఉండే స్్రస్త్రీలు తమ జీవితంలోకి వస్తే వారి జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుందని పురుషులు భావిస్తారని చాణక్యనీతిలో పేర్కొన్నారు.