ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి. తెలుగు కమర్షియల్ సినిమా గురించి చెప్పాలంటే మొదట వినపడేది చిరంజీవి పేరే. 150 కి పైగా సినిమాల్లో నటించి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు చిరు. స్టైల్ తో డాన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు చిరంజీవి. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి చాలామంది వచ్చారు. హీరోలు అవ్వాలని చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి ఇప్పుడు చాలా మంది వస్తూనే వున్నారు.
Advertisement
మొన్నటి తరంలో టాప్ స్టార్ గా కొనసాగిన ఏఎన్నార్ గారి గురించి ప్రత్యేక పరిచయం అనవసరం. స్వయంకృషితో ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దాల కాలం పాటు స్టార్ నటుడిగా కొనసాగారు. ఎన్టీఆర్ కంటే ముందు అడుగు పెట్టి ఎవర్గ్రీన్ హీరోగా ఏఎన్నార్ టాగ్ సొంతం చేసుకున్నారు. అయితే.. చిరంజీవి, ఏఎన్నార్ కలిసి ఓ సినిమాలో నటించారన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఆ సినిమా ఏదో, ఆ సినిమా రిజల్ట్ ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ వంటి హీరోలు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న టైం లోనే చిరు కూడా ఎంట్రీ ఇచ్చారు. వారితో పాటు కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోగా కూడా నటించారు. అయితే.. ఏఎన్నార్ తో మాత్రం ఆ అవకాశం ఒక్కసారి కూడా రాలేదు. 1983లో మెకానిక్ అల్లుడు సినిమాతో ఈ అవకాశం చిరుకి దొరికింది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరోయిన్ గా నటించింది. ఏఎన్నార్, చిరు ల మొదటి కాంబో సినిమా కావడంతో అప్పట్లో ఈ సినిమాపై చాలా అంచనాలే ఉన్నాయి. కానీ, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
మరిన్ని..
టాలీవుడ్ హీరోతో డేటింగ్లో సామజవరగమన హీరోయిన్ ?
బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన సమంత..త్వరలోనే రెండో పెళ్లి ?
బాలకృష్ణ రవితేజ మధ్య గొడవేంటి..? బాలయ్య నిజంగానే కొట్టాడా..?