సాధారణంగా మనకి అత్యంత సన్నిహితంగా మెలిగే కుటుంబ సభ్యులు, బంధువులు లేదా ఫ్రెండ్స్ దూరం అయినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. వారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయినా వారి జ్ఞాపకాలు మనలని వీడి వెళ్లవు. మనకి ఉన్న జ్ఞాపకాలను బట్టే వారు చనిపోయినా మనకి కలల్లో కనిపిస్తూ ఉంటారు. అయితే.. ఇలా చనిపోయిన వ్యక్తులు మన కలల్లో కనిపిస్తున్నారంటే.. దానికి కొన్ని కారణాలు ఉంటాయి అని పండితులు చెబుతున్నారు. ఈ కారణాలు ఏమై ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
Advertisement
చనిపోయిన వ్యక్తులు ఎప్పుడైనా ఒకసారి కలలో కనిపిస్తే పర్లేదు. కానీ.. వారు ఎప్పుడు మన కలల్లోనే కనిపిస్తున్నారంటే.. దాని అర్ధం వారింకా ఈ లోకంలోనే సంచరిస్తున్నారని అర్ధం. వారు ఎదో ఆశిస్తున్నారని.. అందుకే ఈ లోకంలోనే ఉండిపోయారని అర్ధం వస్తుంది. అందుకే వారు ఎవరో ఒకరి కలల్లోకి వచ్చి కనిపిస్తున్నారని అర్ధం. ఇలా పదే పదే ఎవరికైనా కలలో కనిపిస్తూ ఉంటె.. వారు చనిపోయిన వారి పేరిట రామాయణం లేదా భాగవత గ్రంధాలను చదవాలని పండితులు చెబుతున్నారు.
Advertisement
చనిపోయిన వారు మీ కలలో దేని గురించైనా బాధ పడుతూ కనిపిస్తే.. మీకు ఏదో కీడు జరగబోతోందని అర్ధమట. అలా వచ్చినపుడు వెంటనే శాంతి చేయించుకోవాలట. అలాగే.. చనిపోయిన వారు కలలో కనిపిస్తూ ఉండి.. వారు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటే.. ఎవరికైతే కలలో కనిపించారో వారు.. చనిపోయిన వ్యక్తి పేరిట అన్న దానం చేయిస్తే.. మంచి జరుగుతుందట. చనిపోయిన వారి ఆత్మ కూడా శాంతిస్తుందట. అలాగే కలలో కనిపించిన వారు కోపంగా కనిపిస్తుంటే.. వారు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారని అర్ధమట. వారి పేరిట ఏదైనా దానం చేస్తే వారి ఆత్మ శాంతిస్తుందట. అలాగే.. చనిపోయిన వ్యక్తులు నవ్వుతు మీ కలలో కనిపిస్తే.. మీకు అన్నీ శుభాలే జరుగుతున్నాయని అర్ధమట. ఇలా చనిపోయిన వారు మన కలల్లో కనిపిస్తున్నారంటే.. వారు ఏదో ఆశిస్తున్నారని అర్ధమట. వారు ఏమి ఆశిస్తున్నారో అర్ధం చేసుకుని.. అది చేసేవరకు వారు ఈలోకంలోనే సంచరిస్తూ ఉంటారు. వారు కోరేది మనం చేసిన తరువాత ఈ లోకం వదిలి వెళ్ళిపోతారట.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!