సామాన్యుడికి కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. వంటగ్యాస్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహవినియోగ గ్యాస్ పై రూ.50 పెంచింది. దాంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1052 కు చేరింది.
Advertisement
నేడు ఏపీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అదేవిధంగా తెలంగాణలో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
ఐపీఎల్ 2022 నిన్న జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్‌పై 5 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ముంబై 177 పరుగులు చేసి 6 వికెట్లను కోల్పోయింది. గుజరాత్ టైటాన్స్ 172 పరుగులు చేసి 5 వికెట్లను కోల్పోయింది.
సరూర్ నగర్ పరువు హత్యపై ఎంపీ ఓవైసీ స్పందించారు. పరువుహత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆమె ఇష్టపడి వివాహం చేసుకుందని అది సరైన నిర్ణయమేనని అన్నారు. ఆమె సోదరుడు హత్య చేయడం సరైన నిర్ణయం కాదని చెప్పారు. తాము హంతకుల పక్షాననిలబడేవాళ్లం కాదని ఓవైసీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తిగా ఎస్ఎం సుభానిని సుప్రీంకోర్టు కోలిజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి ఎన్ వి రమణ నేతృత్వంలోని కోలిజియం ఈ సిఫారసు చేసింది.
Advertisement
ఇటీవల కురిసిన భారీ వర్షానికి యాదాద్రి అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికీ అక్కడ దిద్దుబాటు చర్యలు కొనసాగుతున్నాయి.
జాతీయ కుటుంబ ఆరోగ్యసర్వే సంచలన నిజాలను బయటపెట్టింది. దేశంలో సంతాన సాఫల్యత తగ్గినట్టు కుటుంబ ఆరోగ్యసర్వే వెల్లడించింది. అదేవిధంగా ఊబకాయం పెరిగిందని స్పష్టం చేసింది.
శ్రీలంకలో సంక్షోభం ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దాంతో అధ్యక్షుడు రాజపక్స రాజీనామా చేయాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు మరోసారి ఎమర్జన్సీని ప్రకటించాడు.
మదర్స్ డే సంధర్బంగా టీఎస్ ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు మదర్స్ డే నాడు ఉచితప్రయాణం ఉంటుందని తెలిపింది.
ఉక్రెయిన్ పై అణుబాంబు దాడి చేయమని రష్యా ప్రకటించింది. అణుబాంబు దాడి వల్ల నష్టమే కానీ ఎలాంటి లాభం లేదని రష్యా విదేశాంగ అధికారప్రతినిధి పేర్కొన్నారు.