ఇండియాలో గడిచిన 24 గంటల్లో 2,259 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 20 మంది మృతి చెందారు.
బీహార్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే 27 మంది మృతి చెందారు. 24 మందికి పైగా గాయపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బీహార్ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
Advertisement
కాకినాడ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కార్ లో ఆయన డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీ కలకలం రేపింది. నేడు ఉదయం సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో మరణించాడు అంటూ అనంత్ బాబు డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. కాగా అనంత్ బాబు…. డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను హత్య చేసి నాటకాలు ఆడుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ లండన్ లోని దావోస్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లండన్ లోని ఇండియా పార్ట్ నర్ ప్రతినిధులతో జరిగిన భేటీలో ఏ రాష్ట్రం ఇవ్వని ప్రోత్సాహకాలు తెలంగాణ ఇస్తుందని చెప్పారు. ఐటీ రంగంలో మానవ వనరులకు హైదరాబాద్ అడ్డాగా ఉందని పలు ఐటీ దిగ్గజాలు వస్తున్నాయని తెలిపారు.
బీటెక్ విద్యార్థులకు జెఎన్ టియూ హైదరాబాద్ గుడ్ న్యూస్ చెప్పింది. 2022-2023 నుండి రెండేళ్లకే కాలేజీ మానేసినప్పటికీ వారికి డిప్లమా సర్టిఫికెట్లు ఇస్తామని ప్రకటంచారు. నాలుగేళ్ల కోర్సు పూర్తి చేస్తే డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తామని ప్రకటించారు.
Advertisement
అనకాపల్లి(రూ)మండలం శంకరం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ పై నుంచి అదుపు తప్పి రెవెన్యూ ఉద్యోగులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన డిప్యూటీ తాహాశీల్ధార్ మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.
ఏపీ సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి దావోస్‌కు బయలుదేరారు. జగన్ తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్, ఎంపీ మిథున్ రెడ్డితో సహా 15 మంది టీమ్ ఉన్నారు.
నేడు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుందని… దానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం దావోస్ పర్యటన సందర్భంగా పరిశ్రమలు రావాలని దేవుడిని ప్రార్థించినట్టు తెలిపారు.
ఐపీఎల్ 2022 లో నిన్న జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్‌పై 8 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది. గుజరాత్ 5 వికెట్ ల కు 168 పరుగులు చేసింది. కాగా బెంగళూరు 2 వికెట్ల వద్ద 170 పరుగులు చేసి విజయం సాధించింది.
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచి తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ సత్తా చాటింది. ఫైనల్‌లో 52 కిలోల విభాగంలో థాయ్‌లాండ్ బాక్సర్ జిత్పోంగ్ జుటామాను ఓడించిన జరీన్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.