ట్విట్టర్లో ఏపీ సీఎం జగన్ మేడే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదన్నారు. శ్రామికుల భాగస్వామ్యం లేని అభివృద్ధి లేదని…. రక్తాన్ని స్వేదంగా మార్చి అవరోధాలను అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక శక్తికి వందనం….అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా ప్రజలకు పెద్దపులి భయం పట్టుకుంది. పెద్దపులి భయం తో నర్సీపట్నం, దేవరాపల్లి మండలాల్లోని గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రహదారులపై ప్రయాణం అంటేనే భయపడుతున్నారు. పెద్దపులి కదలికల పై ఇప్పటికే అటవీశాఖ దృష్టి పెట్టింది.
Advertisement
అండమాన్-విశాఖ మధ్య నౌకాయానం ప్రారంభం అయ్యింది. కోవిడ్ తర్వాత ప్యాసింజర్ నౌక తిరిగి ప్రారంభం అయింది. ఈనెల 5న అండమాన్ నుంచి క్యాంప్ బెల్ నౌక విశాఖకు చేరుకోనుంది. టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది… రద్దీ ఎక్కువగా ఉండటంతో హర్షవర్ధన్ నౌకను సిద్ధం సిద్ధం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఇంజనీరింగ్ సహా ఇతర వృత్తి విద్య కోర్సుల వార్షిక ఫీజును గరిష్టంగా 25 శాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఎంట్రెన్స్ ఫీజుల నియంత్రణ కమిటీ సంకేతాలు ఇచ్చినట్టు వెల్లడించింది.
Advertisement
సామాన్యుడికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 104 పెరిగింది. దాంతో హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర. 2,563 కు చేరుకుంది.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించినంతగా రాణించడం లేదు. కెప్టెన్సీలో జడేజా విఫలమవుతున్నాడు. కెప్టెన్సీ వల్ల బ్యాటింగ్ ఫీల్డింగ్, బౌలింగ్ పై దృష్టి పెట్టలేకపోతున్నారు. దాంతో సిఎస్కే కెప్టెన్సీని తిరిగి ధోని కి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాడు. తదుపరి మ్యాచ్ లకు కెప్టెన్ గా ధోనీ ఉంటాడని యాజమాన్యం ప్రకటించింది.
నిన్నటి తో పోలిస్తే నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర. 48,400 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల 58,200 కు చేరింది.
యాదగిరిగుట్ట పైకి వాహనాలను అనుమతిస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కానీ కొండ పైకి ఎక్కే వాహనాలకు పార్కింగ్ ఫీజు గంటకు రూ. 500 గా నిర్వహించి భక్తులకు షాక్ ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తిరుపతిలో నిన్న అత్యధికంగా 40.51 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని ఆదిలాబాద్ లో కూడా 41.51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దాంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
రష్యా ఉక్రెయిన్ కి మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా హాలీవుడ్ హీరోయిన్ ఏంజలీనా జోలి ఉక్రెయిన్ లో పర్యటించింది. అక్కడ బేకరీలు, రైల్వేస్టేషన్లలో తలదాచుకుంటున్న ప్రజలను పరామర్శించింది. శరణార్థుల ఏజెన్సీ ప్రత్యేక ప్రతినిధిగా ఏంజలీనా జోలి ఉక్రెయిన్ పర్యటనకు వెళ్ళింది.