పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. అయితే, సాధారణంగా పెళ్లి చేసుకోవాలంటే ఆటేడు తరాలు ఈటేడు తరాలు చూసుకొని చేసుకోవాలని సామెత ఉంది. కానీ ప్రస్తుత కాలంలో అలాంటివి పాటించడం లేదు. దీంతో చాలామంది భార్య భర్తలు పెళ్లిళ్లు చేసుకొని ఒకరినొకరు అర్థం చేసుకోలేక మధ్యలోనే పెళ్లి పెటాకులు చేసుకుంటున్నారు. అయితే, తాజాగా ఆస్పత్రి బెడ్ పైనే వధువుకు తాళి కట్టాడు వరుడు.
Advertisement
ఈ సంఘటన వివరాల్లకి వెళితే, చెన్నూరు మండలం, లంబాడి పల్లికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతికి గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లికి ఒకరోజు ముందు బుధవారం పెళ్లికూతురు అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఆమెకు అత్యవసర చికిత్స అవసరమైంది. పెళ్లి రోజైన గురువారం కూడా నవవధువు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆసుపత్రి నుంచి వధువు బయటకు రాలేని పరిస్థితి. అయినప్పటికీ ఇరువురి కుటుంబ సభ్యులు ఎలాగైనా పెళ్లి చేయాలనుకున్నారు. వరుడు కూడా పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. దీంతో వరుడుతో పాటు ఇరు కుటుంబాలు ఆసుపత్రికి చేరుకున్నాయి.
Advertisement
ఆసుపత్రి యాజమాన్యం అనుమతి తీసుకుని అక్కడే పెళ్లి జరిపించేందుకు నిర్ణయించారు. దీంతో ఆస్పత్రి బెడ్ పై చికిత్స పొందుతున్న వధువుకు, వరుడు అక్కడే తాళి కట్టారు. అనంతరం నవ దంపతులు దండలు మార్చుకుని, స్వీట్లు పంచుకున్నారు. వివాహ తంతును ఆసుపత్రిలోనే నిర్వహించుకున్నారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించి వధువును ఆమె కుటుంబ సభ్యుల ఆవేదనను పెళ్ళికొడుకు అతడి కుటుంబం అర్థం చేసుకోవడం విశేషం. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి వాయిదా పడకూడదు అనుకుని ఆస్పత్రిలోనే పెళ్లికి అంగీకరించిన వరుడి తీరును అందరూ అభినందిస్తున్నారు. కొత్త జంటను ఆశీర్వదిస్తున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
READ ALSO : ఒంటరిగా.. బెడ్ రూమ్ కు రమ్మన్నాడు – ఆమని సంచలన వ్యాఖ్యలు..