మోహన్ బాబు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్. మనోజ్ పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే స్టార్ హీరో రేంజ్ కు మాత్రం ఎదగలేకపోయాడు. కానీ మనోజ్ ను అభిమానించేవాళ్లు చాలా మంది ఉన్నారు. వరుస ఫ్లాప్ లు పడటం రియల్ లైఫ్ లో పెళ్లి విడాకుల వల్ల కూడా మనోజ్ సినీ కెరీర్ కాస్త ఇబ్బందుల్లో పడింది. దాంతో చాలా కాలం నుండి సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నాడు.
Advertisement
కేవలం సినిమా అంశాల పైనే కాకుండా సామాజిక అంశాల పై కూడా మనోజ్ స్పందిస్తుంటాడు. గతంలో సింగరేణికాలనీ బాలిక పై దారుణం జరగటంతో అక్కడకు వెళ్లి బాధితులను పరామర్శించాడు. అంతే కాకుండా ఆ రోజు మీడియాతో మాట్లాడుతూ మీడిలా ఇలాంటి విషయాలను కవర్ చేయాలి కానీ సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి కాదంటూ ఫైర్ అయ్యాడు. ఇక సోషల్ మీడియాలో చాలా సార్లు సామాజిక అంశాలపై మనోజ్ తన స్టైల్ లో స్పందించాడు.
Advertisement
అయితే మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు మాత్రం ఎప్పుడూ వార్తలు వినిపించలేదు. కానీ గత కొద్ది రోజులుగా మనోజ్ పొలిటికల్ ఎంట్రి ఇవ్వబోతున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.అలా వార్తలు రావడానికి కూడా ఒక కారణం ఉంది. మనోజ్ తన భార్యతో విడాకుల అనంతరం భూమా మౌనికా రెడ్డితో ప్రేమలో పడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఇటీవల హైదరాబాద్ లో ఓ గణేష్ మండపం వద్దకు కలిసి రావడం చర్చనీయాంశంగా మారింది.
ఇక భూమా మౌనికా రెడ్డి తండ్రి భూమానాగిరెడ్డి మంత్రిగా పనిచేశారు. ఆయన రాజకీయాల్లో చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. కాగా మౌనికా రెడ్డి కూడా తన తండ్రి మరణం తరవాత రాజకీయాల్లో చురుకుగా పనిచేశారు. ఇక మౌనికా రెడ్డి తన భర్తతో విడిపోయాక గత కొన్నేళ్లుగా మనోజ్ తో కలిసి ఉంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే మనోజ్ ను మీడియా మీరు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా అంటూ ప్రశ్నించగా దానిని ఆయన ఖండించకుండా త్వరలోనే దానిపై క్లారిటీ ఇస్తానని చెప్పారు. దాంతో మౌనికారెడ్డితో కలిసి మనోజ్ రాజకీయాల్లో చురుకుగా పనిచేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇక మౌనికా రెడ్డి ఫ్యామిలీ టీడీపీలో చురుకుగా ఉండేవారు. దాంతో ఇప్పుడు మనోజ్ కూడా అదే పార్టీలో చేరబోతున్నాడా లేదంటే వేరే పార్టీలో చేరుతాడా అన్నది ఆసక్తికరంగా మారింది.