మంచు వారి రెండో అబ్బాయి మంచు మనోజ్ భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుమార్తె భూమా మౌనికను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇది రెండవ పెళ్లి. మంచు మనోజ్ కు భూమా మౌనిక చిన్ననాటి స్నేహితురాలు, క్రష్ కూడా. మొదటిసారి వీరిద్దరి పెళ్లి జరగకపోయినా.. రెండవ సారి మాత్రం మంచు మనోజ్ అస్సలు వదులుకోవడానికి ఇష్టపడలేదు. పెద్దలనందరిని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. భూమా మౌనికకు మొదటి భర్తతో ఓ కొడుకు కూడా ఉన్నాడు.
Advertisement
అయితే.. అతన్ని కూడా తన కొడుకుగానే దత్తత తీసుకునేంత పెద్ద మనసు చేసుకున్నాడు మంచు మనోజ్. ఇది శివుని ఆజ్ఞ అంటూ పేర్కొన్న మంచు మనోజ్ మొత్తానికి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తాజాగా.. ఈ దంపతులు తమ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటంటే.. మంచు మనోజ్, భూమా మౌనికలు పేరెంట్స్ కాబోతున్నారు. అయితే.. మంచు లక్ష్మి లా.. భూమా మౌనిక సరోగసిని తీసుకోవడం లేదు. ఆమె స్వయంగా పురిటినొప్పులు ఆస్వాదించడానికి సిద్ధం అయ్యారు.
Advertisement
అయితే.. వీరిద్దరి అభిమానులకు మరో బాడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. భూమా మౌనికకు రాజకీయాల పట్ల ఎంత ఆసక్తి ఉందో అందరికి తెలుసు. అటు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో గాని, ఇటు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి గాని మంచు మనోజ్ దంపతులకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ క్రమంలో భూమా మౌనిక కూడా రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. జరగబోయే ఎన్నికల్లో ఆమె కూడా పోటీ చేస్తారని, ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారని అందరు అనుకున్నారు. కానీ, ఆమె ఇప్పుడు తల్లి కాబోతున్నారు. ఎన్నికల సమయానికి ఆమె నిండు గర్భిణిగా ఉంటారు. దీనితో ఈ సారి ఆమె ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది.