మోహన్ బాబు నటవారసురాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన నటి మంచు లక్ష్మి. విదేశాల్లో చదువుకున్న మంచు లక్ష్మి హాలీవుడ్ సీరియల్స్ కూడా నటించారు. ఆ తరవాత తెలుగు సినిమాలపై ఉన్న ఆసక్తితో తిరిగి హైదరాబాద్ కు వచ్చానని లక్ష్మి అనేక సంధర్భాలలో చెప్పారు. అనగనగ ఓ ధీరుడు సినిమాలో విలన్ గా నటించి మంచు లక్ష్మి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాతోనే తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది.
Advertisement
అంతే కాకుండా గుండెల్లో గోదారి సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేకపోయింది కానీ మంచు లక్ష్మి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తరవాత పలు చిత్రాలలో ముఖ్యమైన పాత్రలు చేస్తూ సినిమాలను కూడా నిర్మించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మంచు లక్ష్మి ఓ వైపు టీవీ షోలు చేస్తూ మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారు.
Advertisement
నిజానికి మంచు లక్ష్మి చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇక మంచు లక్ష్మి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….మంచు లక్ష్మి తన తండ్రి మోహన్ బాబు హీరోగా నటించిన పద్మవ్యూహం సినిమాలో నటించింది. ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేయడంతో పాటూ ఆయనే ఈ సినిమాను నిర్మించారు కూడా.
సినిమాలో మంచు లక్ష్మి గుడిపూజారి పాత్రలో నటించిన మోహన్ బాబు కూతురు గా నటించింది. దిగుదిగునాథ అనే పాటలో కూడా మంచు లక్ష్మి కనిపిస్తుంది. అంతే కాకుండా ఈ సినిమాలో మంచు లక్ష్మి తన ఓన్ వాయిస్ తో ఆకట్టుకుంది. ఈ సినిమా 1980లలో విడుదల కాగా మంచివిజయం సాధించింది. అంతే కాకుండా మంచు లక్ష్మి నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.