Home » నేనే ఏదైనా చేయ‌గ‌ల‌ను… ఆర్జ‌వీ కామెంట్స్‌పై మంచుల‌క్ష్మీ స్పంద‌న‌…

నేనే ఏదైనా చేయ‌గ‌ల‌ను… ఆర్జ‌వీ కామెంట్స్‌పై మంచుల‌క్ష్మీ స్పంద‌న‌…

by Bunty
Ad

మంచుల‌క్ష్మీ ఇటీవ‌లే ఓ ట్విట్ట‌ర్‌లో ఓ ఫోటోను షేర్ చేసింది. చేతిని ముఖానికి అడ్డుగా పెట్టి క‌ళ్లు మాత్ర‌మే క‌నిపించేలా ఫోజులు ఇచ్చింది. ప్రాచీన యోధురాలి గెట‌ప్‌లో వావ్ అనిపించింది. మంచు ల‌క్ష్మీ ఫొటోపై వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కామెంట్స్ చేశాడు. హేయ్ నీకు హద్దులనేవే లేవా?.. నువ్ ఇలా చేయడం నేను నమ్మలేకపోతోన్నా.. ఇది ఎవరో చెప్పని వారికి లక్ష రూపాయలు ఇవ్వను అంటూ కామెంట్స్ చేశాడు. ఆర్జీవీ చేసిన కామెంట్ల‌పై మంచులక్ష్మీ స్పందించింది. ఈరోజు ఈ జ‌న్మ‌కు ఇది చాల‌ని, మీరు న‌న్ను పొగిడారు అని చెప్పింది. అంతేకాదు, నేనే ఏదైనా చేయ‌గ‌ల‌ను అంటూ రిప్లై ఇచ్చింది.

మ‌న‌దేశంలో ప్రాచీన విద్య‌ల్లో క‌లరిప‌ట్టు ఒక‌టి. ప్ర‌స్తుతం ఇది కేర‌ళ‌లో మాత్ర‌మే అందుబాటులో ఉన్న‌ది. ఆ క‌ళ గురించి ఇటీవ‌లే బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది. ప్రాచీన ఈ యుద్ద క‌ళ‌ను ఇప్ప‌టికీ అక్క‌డి ప్ర‌జ‌లు నేర్చుకుంటు ఉంటారు. మ‌ర్మ‌క‌ళ‌గా పేరు పొందిన ఈ ప్రాచీన క‌లరిప‌ట్టు ను మంచు ల‌క్ష్మీ నేర్చుకుంటోంది. ఫిట్‌నెస్ కోస‌మే ఈ క‌ళ‌ను నేర్చుకుంటుందా లేదంటే తాను న‌టిస్తున్న సినిమా కోసం నేర్చుకుంటుందా అన్న‌ది బ‌య‌ట‌పెట్ట‌లేదు. మంచుల‌క్ష్మీ ఈ క‌లరిప‌ట్టు విద్య‌పై దృష్టిసారించ‌డంతో రాబోయే రోజుల్లో తెలుగురాష్ట్రాల్లోనూ ఈ క‌ళను ప్ర‌వేశిస్తుంద‌నుకోవ‌చ్చు.

Advertisement

Visitors Are Also Reading