మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. మంచు లక్ష్మి మనందరికీ సుపరిచితమే మోహన్ బాబు ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది లక్ష్మి. అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ మీద హాట్ కామెంట్స్ ని పాస్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి. నేను హాలీవుడ్ యాక్టర్ ని అక్కడ చాలా సినిమాలు చేశాను ఇప్పటికీ హాలీవుడ్ లో ఉండి ఉంటే కచ్చితంగా టాప్ స్టార్ అయ్యే దానిని అని చెప్పింది లక్ష్మి.
Advertisement
Advertisement
పెళ్లి తర్వాత పిల్లలు కావాలని ఫ్యామిలీతో ఉంటే మంచిదని ఇండియా వచ్చేసానని ప్రస్తుతం నా పాపకి 9 ఏళ్ళు వచ్చాయి నాకు ఇప్పుడు ఫ్రీడం వచ్చింది అని చెప్పింది. అదృష్టం ఉండి హాలీవుడ్లో అవకాశం వస్తే వెంటనే వెళ్ళిపోతానని మంచు లక్ష్మి చెప్పింది. మన తెలుగు దర్శకులు, నిర్మాతలు ఈ పక్క రాష్ట్రాల అమ్మాయిలు కావాలి ఆడియన్స్ కూడా ఎక్కడినుండో వచ్చిన వాళ్ళని ప్రేమిస్తారు. ఊర్లో ఉండే అమ్మాయిని ఒక్క శాతం ప్రేమించి ప్రోత్సహించిన టాప్లో ఉంటారు. ఆడియన్స్ మైండ్ సెట్ మారాలని అప్పుడే అవకాశాలు తెలుగు అమ్మాయిలకి వస్తాయని మంచు లక్ష్మి చెప్పింది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!