Home » 240 కిలోల బరువున్న వ్యక్తికి అరుదైన ఆపరేషన్‌.. 70 కేజీలు తగ్గాడు.. ఎలాగంటే..

240 కిలోల బరువున్న వ్యక్తికి అరుదైన ఆపరేషన్‌.. 70 కేజీలు తగ్గాడు.. ఎలాగంటే..

by Bunty
Ad

ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు అరుదైన సర్జరీ చేసారు. అధిక బరువుతో బాధపడుతున్న యువకుడికి ఆపరేషన్ చేసి ఊరట కల్పించారు. 240 కిలోల బరువు ఉన్న అతనికి బేరియాట్రిక్ సర్జరీ చేసి 70 కిలోల బరువు తగ్గించారు. వివరాల్లోకి వెళితే, హైదరాబాదులోని గుడి మల్కాపూర్ కు చెందిన 24 ఏళ్ల మునీందర్ చిన్నప్పటి నుంచి ఊబకాయంతో బాధపడేవారు. వయసుతో అతని బరువు కూడా పెరుగుతుండటంతో తల్లిదండ్రులు వైద్యులను కలిశారు.

Advertisement

ప్రైవేట్ లో చికిత్స చేస్తే రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. దాంతో వారు ఉస్మానియా వైద్యులను సంప్రదించారు. మునీందర్ ఆరోగ్య పరిస్థితి చూసి జాలిపడిన వైద్యులు ఎలాగైనా సర్జరీ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా రెండు నెలల క్రితం సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఎండోక్రైనాలజీ, అనస్తీసియా వైద్యులు బృందంగా ఏర్పడి అతికష్టం మీద కొన్ని గంటల పాటు శ్రమించి సర్జరీ పూర్తిచేశారు.

Advertisement

అప్పటినుంచి మునీందర్ ను ఆస్పత్రిలోనే పర్యవేక్షణలో ఉంచుకున్నారు. సర్జరీలో భాగంగా పొట్ట పరిమాణం తగ్గించడంతోపాటు ఆహారవాహిక అయిన చిన్న పేగును కొంతమేర తగ్గించారు. దాంతో మునిందర్ తీసుకునే ఆహారం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. దాంతో ప్రస్తుతం అతని బరువు 70 కేజీలు తగ్గి 170 కేజీలకు చేరుకున్నాడు. మరో రెండు నెలలు ఇలాగే చేస్తే మరో 80 నుంచి 90 కేజీల బరువు తగ్గే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. మునీందర్ బాగా లావుగా ఉండటంతో ఆపరేషన్ సమయంలో చాలా ఇబ్బంది అయింది అన్నారు. ఆపరేషన్ టేబుల్ సరిపోకపోవడంతో మరో రెండు టేబుల్లు అటు ఇటు అమర్చి సర్జరీ చేశామన్నారు.

READ ALSO : చిరంజీవితో కలిసి నటించిన ఈ అలనాటి హీరోయిన్ గుర్తుందా? ఆమె భర్త ఓ విలన్ ?

Visitors Are Also Reading