టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అండర్ 19 వరల్డ్ కప్ ను టీమిండియాకు తీసుకువచ్చి ఆ తర్వాత మెయిన్ టీమిండియాలోకి వచ్చాడు విరాట్ కోహ్లీ. వచ్చి రాగానే టీమిండియా లో వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా వచ్చి చాలా సెంచరీలు అలాగే హాఫ్ సెంచరీలు బాదేశాడు విరాట్ కోహ్లీ. అలాగే… చాలామంది సీనియర్ ఆటగాళ్ల రికార్డులను కూడా బద్దలు కొట్టాడు కోహ్లీ. ముఖ్యంగా టీమిండియాలో సచిన్ తర్వాత విరాట్ కోహ్లీ అన్నట్లుగా పేరు తెచ్చుకున్నాడు.
Advertisement
క్రికెట్ పరంగా భారీగా సంపాదిస్తున్న విరాట్ కోహ్లీ… అలాగే కొన్ని సమస్యలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి కూడా కొన్ని కోట్లు సంపాదిస్తున్నాడు. అలాగే చాలా కంపెనీలలో విరాట్ కోహ్లీ పెట్టుబడులు కూడా పెట్టాడట. అయితే తాజాగా విరాట్ కోహ్లీ బిజినెస్ ల గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బ్రాండ్లతో ఒప్పందాలు అలాగే ఎండార్స్మెంట్ల రూపంలో కూడా… విరాట్ కోహ్లీ విపరీతంగా సంపాదిస్తున్నాడని ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పటివరకు ఏ టీమిండియా క్రికెటర్… సంపాదించలేనంత సంపాదిస్తున్నాడట కోహ్లీ. అయితే కోహ్లీ ఇంతలా సంపాదించడానికి… వెనుక రోహిత్ శర్మ బావమరిది ఉన్నాడట. అతని పేరే బంటి సజ్దే.
Advertisement
బంటి….విరాట్ కోహ్లీ ఒక్కనికే కాకుండా చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా బ్రాండ్ మేనేజర్ గా పనిచేస్తున్నాడట. అలాగే ఇతనికి ముంబైలో ఓ ఆఫీస్ కూడా ఉందట. అక్కడి నుంచే అన్ని డీలింగ్స్ నడిపిస్తాడట బంటి సజ్దే. అయితే ఈ బంటి రోహిత్ శర్మ సొంత బావమరిది కాదట. రోహిత్ శర్మ భార్య రితికకు కజిన్ బ్రదర్ అవుతాడట. అయితే బంటి… విరాట్ కోహ్లీ కి సంబంధించిన బ్రాండ్ల డీలింగ్స్… అతని ఇన్కమ్ మొత్తం దగ్గరుండి చూసుకుంటాడట. అలా విరాట్ కోహ్లీకి ఎక్కువగా సంపాదన వస్తుందని సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఎంఆర్ఎఫ్ మరియు మింత్రా లాంటి కంపెనీల బ్రాండ్లకు ప్రమోషన్ చేయడం ద్వారా… బంటి కంపెనీ నుంచి ఏకంగా కోహ్లీ 10 కోట్లు అర్జిస్తున్నాడట.
ఇవి కూడా చదవండి
SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !
కోలుకున్న కీలక ప్లేయర్స్..BCCI హెల్త్ బులిటెన్ విడుదల
హీరోయిన్ వాణి విశ్వనాథ్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?