సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అతి చిన్న వయసులోనే నటన మీద ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు. హీరోగా తనకంటూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న మహేష్ బాబు వ్యక్తిగతపరంగా కూడా మంచి మనసును చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడంలో మహేష్ బాబు కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి ఎంతోమంది చిన్నారుల ప్రాణాలను కాపాడి వారి కుటుంబాలకు అండగా నిలిచాడు.
ఇక మహేష్ బాబు మరో నూతన పనికి శ్రీకారం చుట్టారు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులను చదివించాలనే ఉద్దేశంతో మరో ముందడుగు వేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు భార్య నమ్రత గారు ప్రకటించడం జరిగింది. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక మహేష్ బాబు తండ్రి వర్ధంతి సందర్భంగా ఆయన పేరు మీద స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నామని, ఇప్పటికే నలుగురు పేద విద్యార్థులను ఎంపిక చేసుకున్నామని, వారిని చదివించే బాధ్యతను పూర్తిగా మహేష్ బాబు ఫౌండేషన్ తీసుకుంటుంది. వారి చదువు పూర్తయ్యే వరకు అన్ని బాధ్యతలు మావే.
Advertisement
Advertisement
ఈ చిన్న కార్యక్రమంలో మా మామయ్య, అత్తయ్య గారి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయని ఆకాంక్షిస్తున్నాము అని నమ్రత పేర్కొన్నారు. కృష్ణగారు కూడా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక కృష్ణ గారి వారసత్వాన్ని అందిపుచ్చుకొని మహేష్ బాబు కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలను చేస్తున్నారు. ఇక ఘట్టమనేని కుటుంబంలోనే మంచితనం ఉందేమో…. ఒకప్పుడు కృష్ణ గారు, ఇప్పుడు మహేష్ బాబు, అలానే తన కూతురు సితార కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అని మహేష్ బాబు ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. డబ్బు సంపాదించడం హీరోలుగా వారికి చాలా సులభం. కానీ వారు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పేదలకు సహాయం చేయడం కోసం ఉపయోగించడం చాలా గొప్ప లక్షణం అని మహేష్ బాబును పొగిడేస్తున్నారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!