ఒకే టైటిల్ తో తండ్రీ కొడుకులు సినిమాలు చేసిన సంఘనలు బోలెడు ఉన్నాయి. కానీ ఒక కథతో తండ్రీ కొడుకులు సినిమాలు చేసిన విషయం ఎప్పుడైనా విన్నారా..? కానీ అది మన టాలీవుడ్ లోనే జరిగింది. మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ సినిమాకు కలెక్షన్ ల వర్షం కురిసింది. ఇక సినిమాలో మహేశ్ బాబు తండ్రి ఊరిని విడిచి పట్నంలో స్థిరపడి వేల కోట్ల ఆస్తులను సంపాదిస్తాడు. దాంతో మహేశ్ బాబు పట్నంలోనే పెరుగుతాడు.
Advertisement
కానీ మహేశ్ బాబు మనసంతా తన సొంత ఊరిపైనే ఉంటుంది. దాంతో పెద్దవాడయ్యాక సైకిల్ వేసుకుని ఊరికి బయలుదేరుతాడు. అంతే కాకుండా ఊరిని దత్తత తీసుకుని బాగుచేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో ఎంపీ సోదరులు చేసే అక్రమాలను ఎదిరించి పోరాటం కూడా చేస్తాడు. అక్కడే శృతిహాసన్ తో ప్రేమాయణం కూడా ఉంటుంది.
Advertisement
ఇక ఈ సినిమా వచ్చిన తరవాత ఊర్లను దత్తతు తీసుకునే కార్యక్రమం ఊపందుకుంది. ఇక ఇలాంటి కథతోనే మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 1983లో కృష్ణ అమాయకుడు కాదు అసాధ్యుడు అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా తరవాత కృష్ణ హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా రామరాజ్యంలో భీమరాజు అనే సినిమా వచ్చింది. సినిమాలోని ఓ గ్రామంలో రామరాజు అనే వ్యక్తి ఊరిపెద్దగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను పీడిస్తూ ఉంటాడు.
ఇక అదే గ్రామంలోకి భీమరాజు (కృష్ణ) అడుగుపెడతాడు. రామరాజును ఎదిరిస్తూ ప్రజలను రక్షిస్తుంటాడు. హీరోయిన్ తండ్రి ఇంట్లో పనిచేస్తూ భీమరాజు ఆమెతోనే ప్రేమాయణం నడిపిస్తాడు. క్లైమాక్స్ లో హీరోయిన్ తండ్రి మరో వ్యక్తితో ఆమెను పెళ్లికి సిద్దం చేయగా భీమరాజు తండ్రి వచ్చి నా కొడుకు కోట్ల రూపాయలకు అధిపతి కానీ అవన్నీ కాదనుకుని ఇక్కడకు వచ్చాడని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలా తండ్రీ కొడుకులు ఒకే కథతో వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు.