Home » లోక్ సభలో ఎవరికెన్ని సీట్లు..? జాతీయ సర్వే ఏం చెప్తోంది..?

లోక్ సభలో ఎవరికెన్ని సీట్లు..? జాతీయ సర్వే ఏం చెప్తోంది..?

by Sravya
Ad

తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చింది. అప్పుడే ప్రభుత్వం పైన బీఆర్ఎస్ అస్త్రాలను సిద్ధం చేస్తోంది. రేవంత్ పాలన పరంగా చూసుకున్నట్లయితే కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికలు రేవంత్ సమర్ధకి పరీక్షగా మారబోతున్నట్లు తెలుస్తోంది. అటు కేసీఆర్ ఓడిపోకపోయినా ప్రజల్లో ఆదరణ మాత్రం తగ్గలేదు. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దాన్ని జాతీయ సర్వే వెల్లడించింది.

Advertisement

ఇక ఆ వివరాలని మనం చూద్దాం. టైమ్స్ నౌ ఇట్ ఇస్ సంస్థ చేసిన సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ 8-10 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ 3-5 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపి కూడా 3-5 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. అలానే ఇతరులు ఒక స్థానాన్ని గెలుచుకుంటారని తెలుస్తోంది. బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో కూడా పుంజుకునే అవకాశం లేదని క్లియర్ గా సర్వే చెప్తోంది.

Advertisement

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇప్పుడైతే రేవంత్ పైనే భారం పెడుతోంది. లోక్ సభ ఎన్నికల వరకు రేవంత్ పీసీసీ చీఫ్ గా కొనసాగించాలని చూస్తోంది. కేసీఆర్ అలర్ట్ అవుతున్నారు. ఆరోగ్య పరంగా పూర్తిగా కోలుకుని ప్రజల్లోకి వెళ్లాలని ఆయన అనుకుంటున్నారు. బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకోవటం, అలానే ఓట్ షేర్ పెంచుకుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading