మరో రెండు రోజుల్లో డిసెంబర్ 31 వ తేదీ రానుంది. డిసెంబర్ 31 వ తేదీన అందరూ.. మందు పార్టీలు ఎక్కువ చేసుకుంటారు. మద్యం ధరలు ఎంత ఉన్నా, కొనేస్తారు. అయితే, డిసెంబర్ 31 వ తేదీ వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ మందుబాబులకు గుడ్ న్యూస్ తెలిపింది. మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల సమయ వేళలను మార్చింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది.
Advertisement
ఇక బార్ అండ్ రెస్టారెంట్లలో రాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయించేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. అలాగే రిటైర్ షాపుల్లో మద్యం అమ్మకాలకు ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఉండగా, 31న ఒక గంట పాటు పెంచుతూ రాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు మూసి ఉండనున్నాయి.
Advertisement
ప్రస్తుతం రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచే బార్లు డిసెంబర్ 31న రాత్రి ఒంటిగంట వరకు తెరుచుకోవచ్చని తెలిపింది. అటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పలు ఆంక్షలు విధించారు. 31వ తేదీ రాత్రి 10 గంటల నుండి ఒకటో తేదీ తెల్లవారుజాము 5 గంటల వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు మూసివేయనున్నారు. వారర్ పై లైట్ మోటార్ వెహికల్ కు అనుమతి లేదు. ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. కమిషనరేట్ పరిధిలోని 10 ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు పోలీసులు.