Home » అడుక్కునే స్థితిలో రమాప్రభ అంటూ వార్తలు…వాళ్ళు సాయం చేశారు అంటూ నటి క్లారిటీ…!

అడుక్కునే స్థితిలో రమాప్రభ అంటూ వార్తలు…వాళ్ళు సాయం చేశారు అంటూ నటి క్లారిటీ…!

by AJAY
Ad

ఒకప్పుడు హీరోయిన్ లుగా రాణించిన చాలా మంది ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారిపోయారు. ఆ లిస్ట్ లో ఒక్కప్పటి హీరోయిన్ రమా ప్రభ్ కూడా ఉన్నారు. రమా ప్రభ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించారు. ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తారు. వందల సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటించారు. దేశముదురు సినిమా లో సన్యాసిని గా నటించి తన నటన తో మెప్పించారు.

Advertisement

Advertisement

అంటే కాకుండా హీరో హీరోయిన్ లకు భామ్మ పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక వయసు పెరగటం తో రమా ప్రభ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కాగా రమాప్రభ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుందని అంతే కాకుండా అడుక్కునే తినే స్థితిలో రమాప్రభ ఉందని రకరకాల వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆ వార్తల పై రమాప్రభ స్పందించారు. కొన్ని యుట్యూబ్ చానల్స్ వాళ్ళు నేను అడుక్కుతినే స్థితిలో ఉన్నట్టు వార్తలు రాస్తున్నారు. నేను నా యూట్యూబ్ ఛానల్ లో నా ఇంటిని చూపించాను. అడుక్కుతినే స్థితిలో నేను ఉంటే అది నా ఇల్లు ఎలా అవుతుంది.

నేను బిజీగా ఉన్నా సినిమాలు చేస్తున్నా ఇంకా ఎప్పుడు అడుక్కుంటున్నా….పూరి జగన్నాథ్, నాగార్జున మరికొందరు సెలబ్రిటీలు నా మీద ఆప్యాయత తో ఆదుకుంటున్నారు. అలాంటప్పుడు అది సహాయమో….అడుక్కోవడమో ఎందుకు అవుతుంది వాళ్ళు నాకు బిక్ష వేయడం లేదు. నేను అందరికంటే రిచ్ గా ఉన్నాను….అంటూ రమా ప్రభ వ్యాఖ్యానించింది.

Visitors Are Also Reading