సాధారణంగా పెళ్లి చేసుకోవాలంటే అటేడుతరాలు ఇటేడు తరాలు చూసుకొని చేసుకోవాలనే సామెత ఉంది. కానీ ప్రస్తుత కాలంలో అలాంటివి పాటించడం లేదు. దీంతో చాలామంది భార్యాభర్తలు పెళ్లిళ్లు చేసుకొని ఒకరినొకరు అర్థం చేసుకోలేక మధ్యలోనే పెళ్లి పెటాకులు చేసుకుంటున్నారు. అలా జరగకుండా ఉండాలంటే పెళ్లి చేసుకునే ముందు ముఖ్యంగా యువతుల్లో ఈ లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఇవి ఉంటే వారి జీవితం సుఖమయం అవుతుందని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సమస్యలు పంచుకోవడం:
Advertisement
సాధారణంగా భార్యాభర్తలు అంటే అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య సంతోషం వచ్చినా బాధ వచ్చిన ఇద్దరు కలిసి పంచుకుంటే దాంపత్య జీవితం బలంగా ఉంటుంది. కానీ కొంతమంది సంతోషాన్ని పంచుకున్నంత శ్రద్ధగా బాధను పంచుకోరు. వారి మనసులోని బాధను చెప్పే ప్రయత్నం చేసినా కానీ వినీ విననట్లుగా ఉంటారు. అదే మానసిక పరిపక్వత చెందిన భాగస్వామి దొరికితే నీ జీవితం సుఖమయం అవుతుంది. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అర్థం చేసుకొని మీతో తోడునీడగా ఉంటుంది.
నిందలు వేయడం :
Advertisement
మనిషి అన్నాక తప్పులు జరగడం సహజం. కొన్నిసార్లు తెలుసో తెలియకో జీవిత భాగస్వామి తప్పులు చేస్తే ఆ తప్పేంటో గ్రహించి వారికి మరోసారి చేయకుండా సమాధానం చెప్పాలి. కానీ ఆ తప్పును పట్టుకొని జీవిత భాగస్వామిపై పదేపదే నిందలు వేయడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల దంపతుల మధ్య దూరం పెరుగుతుంది తప్ప ప్రయోజనం ఉండదని తెలియజేస్తున్నారు.
పెద్దలను గౌరవించడం:
సాధారణంగా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అంటే వారిద్దరికీ ఇరు కుటుంబాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా అమ్మాయి అత్తవారి కుటుంబీకుల్ని గౌరవంగా చూసుకుంటే ఇక ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు రావు. దీనివల్ల దంపతుల సంసార జీవితం కూడా ఆనందంగా గడుస్తుంది. ఇలాంటి పెద్దలను గౌరవించే అమ్మాయి దొరికితే అబ్బాయి చాలా అదృష్టవంతుడు.
also read: