టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి తెలియని వారుండరు. అయితే.. తాజగా మెగా కుటుంబ హీరోలపై కీలక వ్యాఖ్యలు చేసింది లావణ్య త్రిపాఠి. సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరంతేజ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం “బ్రో”. తమిళంలో సముద్రఖని నటించి తెరకెక్కించిన వినోదయ సిత్తం సినిమాకి ఇది రీమేక్.
Advertisement
పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి జి స్టూడియోస్ వారు అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 28వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి నెటిజన్ల నుండి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా మెగా కుటుంబానికి కాబోయే కోడలు లావణ్య త్రిపాఠి ఈ టీజర్ పై క్రేజీ కామెంట్స్ చేసింది.
Advertisement
ఇటీవల రిలీజ్ అయిన బ్రో టీజర్ పై ట్విట్టర్ వేదికగా లావణ్య త్రిపాఠి స్పందిస్తూ..” మీ ఇద్దరినీ ఇలా ఒకే స్క్రీన్ పై చూడడం కన్నుల పండుగగా ఉంది. టీజర్ చాలా అద్భుతంగా ఉంది” అని ట్విట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడం గమనార్హం. అయితే కొంతమంది నెటిజెన్స్ మాత్రం ఆమెని ట్రోల్ చేస్తున్నారు. కాబోయే మామయ్యని చిన్న మామయ్య అంటూ ప్రేమగా పిలవచ్చు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఈ సినిమా గురించి మీరు ట్విట్ చేయడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని.. కొత్త కోడలు ఆన్ డ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.