టాలీవుడ్ ఇండస్ట్రీలో లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటీవలే లావణ్య త్రిపాఠి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. దాదాపు ఏడు సంవత్సరాల పాటు వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్నారు.
Advertisement
ఇక ఈ విషయం పెద్దలకు తెలపడంతో నవంబర్ ఒకటో తేదీన.. ఇటలీలో వీరి వివాహం జరిగింది. మెగాస్టార్ కుటుంబం, అల్లు వారి కుటుంబం అలాగే లావణ్య త్రిపాఠి కుటుంబం అటు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా వీరి వివాహానికి వెళ్లారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న లావణ్య త్రిపాఠి… నిహారిక కాపురంలో వేలుపెడుతోందట. నిహారికను ఎలాగైనా వెంకటచైతన్యతో కలపాలని ప్రత్యేక ప్రయత్నం చేస్తుందట లావణ్య త్రిపాఠి.
Advertisement
ఈ మేరకు ఇప్పటికే జొన్నలగడ్డ వెంకట చైతన్య ను లావణ్య త్రిపాఠి కలిసిందట. దీంతో నిహారికను కలిసేందుకు వెంకటచైతన్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. నిహారిక మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదట. దీంతో లావణ్య త్రిపాఠి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇటీవలే నిహారిక, వెంకట్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!