మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ లో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కూడా ఒకటయ్యారు. ఎక్కడ చూసినా వాళ్ళిద్దరి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో కూడా వాళ్ల గురించే చర్చ జరుగుతుంది.
Advertisement
మెగా ఫ్యామిలీ గురించి అందరికీ తెలుసు కానీ లావణ్య ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా మందికి తెలియదు. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటా అని ప్రతి ఒక్కరు ఆరా తీయడం మొదలుపెట్టారు గూగుల్‌లో అనేక విషయాలని వెతుకుతున్నారు కూడా. అయితే కొంత ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది దానిని మేము మీ కోసం తీసుకువచ్చాము. లావణ్య త్రిపాఠి కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
Advertisement
లావణ్య ఉత్తర్కాండ్ రాష్ట్రానికి చెందిన ఆమె. లావణ్య త్రిపాఠి అయోధ్యలో పుట్టారు. ఆమె తండ్రి హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు. తల్లి టీచర్. లావణ్య స్కూల్ విద్యాభ్యాసం డెహ్రాడూన్ లో జరిగింది లావణ్య కి ఒక చెల్లి తమ్ముడు కూడా ఉన్నారు ఆమెకి మొదట్లో సినిమాలు అంటే ఇష్టం లేదు. కానీ డిగ్రీ తర్వాత సినిమాల మీద ఇష్టం పెరిగింది తండ్రికి ఈ విషయాన్ని చెప్పారు. తండ్రి కూడా ఒప్పుకున్నారు మోడలింగ్ చేస్తూ ఆమె మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ ని గెలుచుకున్నారు. ఆమె క్లాసికల్ డాన్సర్ కూడా భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది.
ఆమెకి తెలుగులో సినిమాలతోనే అవకాశాలు వచ్చాయి 2012లో అందాల రాక్షసి సినిమాలో నటించింది లావణ్య తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. సినిమాల్లో నటిస్తూ 20 కోట్ల వరకు ఆస్తులని ఆమె కూడబెట్టుకున్నారు లావణ్య ప్రతి సినిమాకి 50 లక్షల దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటారు ఆమె తల్లిదండ్రులు కూడా బాగానే సంపాదించారు. గత ఐదేళ్ల నుండి వరుణ్ తేజ్‌తో ప్రేమలో ఉన్నారు లావణ్య కానీ ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచారు ఇద్దరు కలిసి అంతరిక్షం సినిమాలో నటించారు. అప్పటినుండి కూడా వీళ్ళ మధ్య ప్రేమ ఉంది. ఇప్పుడు లావణ్య ఫ్యామిలీ వరుణ్ ఫ్యామిలీ ఒకటి అయింది. రిసెప్షన్ హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరుపుతున్నారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!