కంప్యూటర్ వాడకం అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ మధ్య కాలంలో. లాప్ టాప్ ఆర్ డెస్క్ టాప్ ఏదైనా సరే ఎక్కువగానే వాడుతున్నారు. అయితే లాప్ టాప్ బెస్టా లేక డెస్క్ టాప్ బెస్టా అంటే… చాలా మంది డెస్క్ టాప్ అనే చెప్తూ ఉంటారు. అసలు డెస్క్ టాప్ ఎందుకు మంచిదో చూద్దాం.
Advertisement
చాలా ఆఫీసుల్లో డెస్క్ టాప్ నే ఎక్కువగా వాడుతున్నారు. ల్యాప్ టాప్ లతో పోల్చుకుంటే డెస్క్ టాప్ లు తక్కువ ధరకే మంచి కంపెనీలవి దొరుకుతూ ఉంటాయి. దానితో… బ్యాక్ ఆఫీస్ వారికి గాని, కాల్ సెంటర్ వారికి గాని, కస్టమర్ సపోర్ట్ వారికి గాని డెస్క్ టాప్ లనే ఇస్తూ ఉంటారు. వీళ్ళకు వర్క్ ఫ్రం హోం లేకపోవడంతో వీళ్ళ తర్వాత వేరే వాళ్లకు అది అలాట్ చేస్తూ ఉంటారు. ఇక చాలా చోట్ల డెవలపర్లు కూడా డెస్క్ టాప్ నే వాడతారని నిపుణులు చెప్తున్నారు.
Advertisement
గంటల తరబడి పని చేయటానికి డెస్క్ టాప్ నే ఎక్కువగా వాడుతూ ఉంటారు.ల్యాప్ టాప్ తో పోల్చుకుంటే డెస్క్ టాప్ లు ఇప్పటికీ పవర్ఫుల్ సిస్టమ్స్ అని టెక్ నిపుణులు అంటున్నారు. డెస్క్ టాప్ ప్రాసెసర్లు చాలా పెద్దగా ఉంటాయి. కాబట్టి పర్ఫార్మెన్స్ చాలా నీట్ గా ఉంటుంది. బ్యాటరీ గురించి కంగారు కూడా ఉండదు. ల్యాప్ టాప్ తో పోలిస్తే డెస్క్ టాప్ లకు ఇంటర్నల్ స్టోరేజ్ డ్రైవ్స్ ఎక్కువ ఇస్తారు.
ఎక్సటర్నల్ స్టోరేజ్ వాడినా కూడా డెస్క్ టాప్ లోలా ఇంటర్నల్ డ్రైవ్స్ లాప్ టాప్ లో అందుబాటులో ఉండవు. డెస్క్ టాప్ తో వచ్చే కీబోర్డ్ వాడటానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. లాప్ టాప్ కి అనుసంధానిచుకున్నా కూడా కంఫర్ట్ అంతగా ఉండదు. డెస్క్ టాప్ స్క్రీన్ సైజ్ 19 అంగుళాల వరకు ఉంటుంది. వ్యూ కూడా చాలా నీట్ గా ఉంటుంది. అప్-గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే డెస్క్-టాప్ లే సౌకర్యంగా ఉంటాయని చెప్తున్నారు. రిపేర్ విషయానికి వస్తే డెస్క్-టాప్ రిపేర్ చేయటం చాలా ఈజీ.