విజయవాడకు ఎన్టీరామారావు జిల్లా అని పేరు పెట్టడంపై వైసీపీ నేత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి స్పందించారు. ఎంతో సంతోషంగా ఉందని…గతంలో ఎన్టీఆర్ నుండి పార్టీని లాక్కొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు ఆయన విగ్రహానికి దండలు వేస్తారు…పొగుడుతారు ఆదర్శం అంటారు. కానీ ప్రాక్టికల్ గా ఎన్టీఆర్ గురించి ఒక్క శాశ్వతమైన పని ఆయన సీఎంగా ఉన్న 14 ఏళ్లలో చేశారా అంటూ ప్రశ్నించారు.
కానీ సీఎం జగన్ కు బంధువు కాదు…ఏనాడు కలవలేదు కానీ పెద్దల పట్ల ఉండే గౌరవాన్ని చూపించారని అన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైందని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరించుకుంటూ వెల్లడం సామాన్యూడికి క్రింది వర్గాల వాళ్లకు మేలు జరుగుతుందని చెప్పారు. రెవెన్యూ డివిజన్ లు పెంచడం వల్ల అందరికీ మేలు జరుగుతుందని అన్నారు.
జిల్లాలకు గొప్పవాళ్ల పేర్లు పెట్టి సీఎం జగన్ పెద్దల పట్ల గౌరవాన్ని చాటుకున్నారని వ్యాఖ్యానించారు. విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టడం అనేది ఎన్టీఆర్ అభిమానులు సంతోషపడాల్సిన విషయం అని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ లోనే మంచి పేరుతెచ్చకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఎన్టీఆర్ బాల్యం నుండి విజయవాడలో ఉన్నారని చెప్పారు. ఎన్టీఆర్ పుట్టింది నిమ్మకూరు అయినా పెరిగింది మాత్రం విజయవాడలోనే అని చెప్పారు. ఆయన పెళ్లి చేసుకుంది స్థిరపడింది కూడా విజయవాడనే అని చెప్పారు. అది ఆలోచించే సీఎం జగన్ విజయవాడకు ఆయన పేరు పెట్టారని భావించారు. ఎన్టీఆర్ కేవలం తన నియోజకవర్గానికే కాకుండా అన్ని జిల్లాలకు మంచి చేశారని చెప్పారు.