ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలంటే ఆడవారు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలని పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. మహిళలు ఈ నియమాలు పాటించడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు కలుగుతాయని చెబుతుంటారు. భర్త ప్రేమ పొందడానికి సంతానం, కలగడానికి, ఇంట్లోవారికి వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని అంటూ ఉంటారు. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఆడవారు అలవాట్లలో మంగళసూత్రానికి పిన్నీసులను పెడుతూ ఉంటారు. మంగళ సూత్రానికి జడకు పెట్టుకునే పిన్నిసులను పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల భర్త ఆరోగ్యం పాడవుతుందని, భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
Advertisement
వేద మంత్రాల సాక్షిగా భర్త ఆయువు మంగళసూత్రం రూపంలో భార్య హృదయానికి వచ్చి చేరుతుంది. అంతేకాకుండా మంగళ సూత్రాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. మంగళసూతానికి దివ్య శక్తులను ఆకర్షించే శక్తి ఉండడం వల్ల మంగళ సూత్రానికి పిన్నిసులను, పిన్నులను పెట్టడం మంచిది కాదు. అలాగే ప్రస్తుత కాలంలో మహిళలు వివిధ రకాల గాజులను ధరిస్తున్నారు. కానీ మట్టిగాజులను ధరించడం మంచిదని చెబుతున్నారు. మట్టి గాజుల నుంచి వచ్చే శబ్దం ఐశ్వర్యాన్ని, భార్యాభర్తల అనురాగాన్ని పెంచుతుంది. ఎరుపు, ఆకుపచ్చ రంగు గాజులు ధరించడం వల్ల శుభాలు కలుగుతాయి. ఇంట్లో కొందరు గుర్రపు బొమ్మలను పెట్టుకుంటూ ఉంటారు. ఇలా గుర్రపు బొమ్మలను పెట్టడం వల్ల గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుతుందో అంతే వేగంగా ధనం కూడా ఖర్చవుతుంది అని పెట్టుకోవడం మంచిది కాదని చెబుతుంటారు.
Advertisement
భర్త స్థితిగతులను భార్య ధరించిన నగలు, వస్త్రాల ద్వారా అందరికీ తెలుస్తుంది. మహిళలు ఎక్కువగా నగలు, పట్టు వస్త్రాలు ధరించడం వల్ల నరదిష్టి తగులుతుందట. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి. అందువల్ల వీలైనంత తక్కువగా అలంకరించుకొని వెళ్లాలని చెబుతున్నారు. మరికొందరు ఏమో పిల్లలు తమ మాట వినడం లేదని అంటూ ఉంటారు. పిల్లలు తమ మాట వినాలంటే ఆడపిల్లలకి ఎర్ర దారాన్ని తీసుకొని కుడి భుజానికి కట్టాలి. అలాగే కుంకుమని పెట్టుకోవడం అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల ఆడపిల్లలు తమ మాట వింటారు. అదే విధంగా మగవారికి 9 పోగుల ఆకుపచ్చ దారాన్ని కుడి భుజానికి కట్టాలి. గంధం బొట్టును పెట్టాలి. ఇలా చేయడం వల్ల మగవారు మాట వింటారు.
కొందరు మహిళలు ఆడపడుచులతో, అత్తతో గొడవపడి మనశ్శాంతికి దూరం అవుతారు. అలాంటివారు ఆడపడుచు లేదా అత్త పడుకునే దిండు కింద తులసి వేరును ఉంచడం వల్ల వారితో గొడవలు తగ్గి విపరీతమైన ప్రేమను చూపిస్తారట. ఇక కొంతమంది ఆడవారు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ, చికాకులు, కోపంతో వంట చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం అస్సలు మంచిది కాదు. స్నానం చేసే ప్రశాంతంగా దైవ నామస్మరణ చేస్తూ వంట చేయడం వల్ల వంట రుచిగా ఉండడమే కాకుండా ఇంట్లో వారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారట. మహిళలు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్!
Actor Manas: శ్రీజతో ‘బ్రహ్మముడి’ సీరియల్ హీరో నిశ్చితార్థం
ఖుషి సూపర్ హిట్.. అజ్ఞాతంలోకి నాగచైతన్య..?