Home » పురంధేశ్వరి నియామకంతో టీడీపీలో చీలిక రాబోతుంది – లక్ష్మీపార్వతి

పురంధేశ్వరి నియామకంతో టీడీపీలో చీలిక రాబోతుంది – లక్ష్మీపార్వతి

by Bunty
Ad

రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులను కేంద్ర బిజెపి మార్చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పెద్ద నిర్ణయమే తీసుకొని… రెండు రాష్ట్రాల అధ్యక్షులను మార్చేసింది బిజెపి. ఇందులో భాగంగానే తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించిన బిజెపి అధిష్టానం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా నందమూరి తారక రామారావు కూతురు దగ్గుబాటి పురందేశ్వరుని నియమించారు.

Advertisement

అయితే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరుని నియమించడంపై నందమూరి లక్ష్మీపార్వతి తన స్టైల్లో స్పందించారు. నందమూరి లక్ష్మీ పార్వతి ఇవాళ మీడియా తో మాట్లాడారు. స్వతంత్రంగా ఎదగాలనే ఆలోచనలతో ఉన్న పురంధేశ్వరి నియామకంతో టీడీపీలో చీలిక వస్తుందని హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళితే బీజేపీకే నష్టం వాటిల్లుతుందని చెప్పారు నందమూరి లక్ష్మీ పార్వతి.

Advertisement

ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ పార్టీని తిరస్కరించే వాళ్ళు అందరూ బిజేపి, పురంధేశ్వరి వైపునకు వెళతారని పేర్కొన్నారు నందమూరి లక్ష్మీ పార్వతి. చంద్రబాబు కంటే ప్రభావవంతంగా పురంధేశ్వరి వ్యవహరిస్తారని నేను అనుకోవడం లేదన్నారు. బీజేపీ వాళ్ళు దేశ ముదుర్లు అంటూ ఫైర్ అయ్యారు నందమూరి లక్ష్మీ పార్వతి. బీజేపీతో సాన్నిహిత్యం కోసం పావురాలు, కాకులతో ను చంద్రబాబు సందేశాలు పంపి చివరకు అమిత్ షా ను కలవగలిగారని చురకలు అంటించారు. బీజేపీ, టీడీపీ కలిస్తే.. వైసీపీ నెత్తిన పాలు పోసినట్టేనని పేర్కొన్నారు.

Visitors Are Also Reading