అందంగా బొద్దుగా ముద్దుగా ఉండే ఖుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిమ్లా ఆపిల్ పండులా మెరిసిపోతూ సౌత్ ఇండస్ట్రీ ప్రజలను ఆకర్షించే డ్రీమ్ గర్ల్ గా ఉండిపోయింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్త బరువెక్కి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తుంది కానీ ఒకప్పుడు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించేసింది.
Advertisement
అలాంటి ఈ బ్యూటీ 50 ఏళ్ల వయసు వచ్చిన చెక్కుచెదరని చర్మ సౌందర్యంతో కుర్ర హీరోయిన్లకు చమటలు పట్టించేస్తుంది. ప్రస్తుతం ఒకపక్క సినిమాలు, మరోపక్క షోలు జీవితం ఆనందంగా సాగిపోతున్న తరుణంలో అలజడి ఏర్పడింది. ఖుష్బూ ఇంట విషాదం నెలకొంది. ఆమె సొంత అన్నయ్య ఇవాళ మృతి చెందారు. ఈ విషాదకర వార్తను ఆమె ట్విట్టర్ వేదికగా ఆమె వెల్లడించారు. ఖుష్బూ 1970లో సెప్టెంబర్ 29న ముంబైలోని అందేరి లో జన్మించారు.
Advertisement
అసలు పేరు నకత్ ఖాన్. ఈమెకు ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు. అబ్దుల్లా, అబూ బాకర్, ఆలీ. అబ్దుల్లా ఇవాళ కాలం చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా వారం కిందట ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే రెండు రోజులు ఆరోగ్యం నిలకడగానే ఉన్న, ఇవాళ విషమించడంతో చనిపోయారు. తన అన్న మృతిని జీర్ణించుకోలేని ఖుష్బూ ట్విట్టర్ వేదికగా భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. మనం ఎంతగానో ప్రేమించే వ్యక్తులు ఎప్పటికీ మనతోనే ఉండాలని అనుకుంటాము. కానీ సమయం వస్తే గుడ్ బై చెప్పాల్సిందే. అన్నయ్య ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి : కమెడీయన్ ఆలీకి జగన్ బంపర్ ఆఫర్..అక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ !