ప్రస్తుతం ప్రతిఒక్కరికీ వ్యాయామం ఖచ్చితంగా అవసరం అయ్యింది. ఒక్కప్పుడు అంతా శారీరకంగా కష్టపడే పనులే ఎక్కువగా చేసేవారు కానీ ఇప్పుడంతా కంప్యూటర్ యుగం..ఎవరూ గంటల తరబడి శారీరక కష్టం చేయడం లేదు. కాబట్టి వ్యాయామం చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. ఇక వ్యాయామం చేయాలంటే గ్రామాలలో అయితే పెద్దగా ఖర్చవ్వదు కానీ నగరాల్లో మాత్రం వేలల్లో ఖర్చు చేయాల్సిందే.
Advertisement
అయితే అలా జిమ్ లలో ఎక్కువగా ఖర్చు చేయలేదని థ్రెడ్మిల్ లాంటి మిషన్ లను కొనుక్కోలేని వారికోసం తెలంగాణ కు చెందిన ఓ వ్యక్తి థ్రెడ్మిల్ ను తయారు చేశాడు. ఆ థ్రెడ్మిల్ కరెంట్ కూడా అవసరం లేకుండానే పనిచేయడం ప్రత్యేకత. ఇక ఆ థ్రెడ్మిల్ తయారు చేసింది ఎరన్నది తెలియదు కానీ వ్యక్తి థ్రెడ్మిల్ తయారు చేసి దానిపై వ్యాయామం చేస్తున్న వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
Advertisement
ఇక ఈ వీడియో కాస్తా ఐటీ మంత్రి కేటీఆర్ కంట పడింది. ఇంకేముందు కేటీఆర్ వెంటనే తెలంగాణ వర్క్స్ అఫీషియల్ పేజీని ట్యాగ్ చేసి ఆయన వివరాలు తెలుసుకోవాలని కోరారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పైసా ఖర్చు లేకుండా వ్యాయామం చేయవచ్చని అంటున్నారు. అంతేకాకుండా ఇలాంటి థ్రెడ్మీల్ లను తయారు చేయించి హైదరాబాద్ లలోని పార్క్ లలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Wow! 👏👏 @TWorksHyd please connect & help him scale up https://t.co/FVgeHzsQx8
— KTR (@KTRTRS) March 18, 2022