ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన బ్యూటీ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే కృతి శెట్టికి చాలా గుర్తింపు వచ్చింది. ఉప్పెన సినిమా విడుదలకు ముందే ఆ సినిమా పాటలు విడుదలయ్యాయి. వీడియో సాంగ్స్ లో కృతి శెట్టి ఎక్స్ ప్రెషన్స్ చూసి ఫిదా అయిన దర్శకనిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కట్టారు. దాంతో ఉప్పెన సినిమా విడుదలకు ముందే కృతి శెట్టి రెండు మూడు సినిమాలకు సైన్ చేసింది.
Advertisement
ఇక సినిమా విడుదలైన తర్వాత భారీ విషయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కృతి క్యూట్ నెస్ కి కుర్రాళ్ళు ఫిదా అయ్యారు. ఉప్పెన తర్వాత కృతి శెట్టి బంగార్రాజు, శ్యాం సింగరాయ్ సినిమాలతో పాటు పలు చిత్రాల్లో నటించి అలరించింది. ఇదిలా ఉంటే హీరోయిన్ గా ఎదగడానికి కృత్తి శెట్టి ఎంతో కష్టపడినట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తన తల్లి సహకారం గురించి చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది.
Advertisement
కృతి శెట్టి పుట్టింది ముంబైలో అయినా కర్ణాటక లోని మంగళూరు వారి సొంత ఊరు. కృతి శెట్టి తండ్రి వ్యాపారం చేస్తుండగా ఆమె తల్లి ఫ్యాషన్ డిజైనర్… ఇక కృతికి ఓ తమ్ముడు మరియు చెల్లి కూడా ఉన్నారు. కృతి శెట్టి సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో టీవీ యాడ్స్ ఇతర ప్రకటనల్లో నటించేదట.
అలా మెల్లిమెల్లిగా సినిమా ఆఫర్ లను అందుకుంది. ఉప్పెన ఆఫర్ రావడంతో కృతి శెట్టి తల్లి తనకోసం ఫ్యాషన్ డిజైనర్ ఉద్యోగాన్ని సైతం మానేసిందట.తన తల్లి ప్రతిరోజు షూటింగ్ కు తనతో వచ్చేదని కృతిశెట్టి తెలిపింది. ఎక్కడికి వెళ్లినా తన తల్లి తనతో తోడుగా వస్తుందని చెప్పింది. అలా కృతి శెట్టి తల్లి తన కోసం ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిందని ఎమోషనల్ అయింది. ఇక కృతి శెట్టి తల్లి చేసిన పనికి ఆమెను అందరూ శభాష్ అని మెచ్చుకుంటున్నారు.