1983 లో కోదండ రామిరెడ్డి ఓ కథ రెడీ చేసుకొని కృష్ణ దగ్గరికి వెళ్లాడు. కృష్ణకు కూడా కథ నచ్చింది. కానీ అప్పుడు కృష్ణ ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో కొన్ని రోజులు వెయిట్ చేద్దామన్నాడు. కానీ తర్వాత డేట్స్ కుదరట్లేదు అనడంతో అదే కథను తీసుకొని అప్పుడప్పుడే ఎదుగుతున్న చిరంజీవికి వినిపించాడు కోదండరామిరెడ్డి. నెక్ట్స్ థాట్ లేకుండా చిరు ఆ సినిమాను చేసేశాడు. ఆ సినిమానే చిరును స్టార్ హీరోగా మార్చింది. అదే ఖైదీ!
Advertisement
Advertisement
1993 లో SV కృష్ణారెడ్డి అన్నయ్య అనే కథను రెడీ చేసుకొని చిరు దగ్గరికి వెళ్లాడు. చిరుకు కూడా కథ నచ్చింది. కానీ తనను కృష్ణారెడ్డి సరిగ్గా హ్యాండీల్ చేయలేడనే అనుమానంతో రిజెక్ట్ చేశాడు. అప్పటికే కృష్ణారెడ్డికి కృష్ణతో మంచి పరిచయం ఉండడంతో ఆ కథను కృష్ణ ఒప్పుకున్నాడు కానీ అప్పటికే అన్నయ్య అనే టైటిల్ తో కృష్ణ సినిమా ఉండడంతో ఆ సినిమాను నెంబర్ వన్ గా మార్చారు. అది కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇలా క్రిష్ణ వదిలేసిన సినిమాతో చిరు స్టార్ హీరో అవ్వగా , చిరు వదులుకున్న సినిమాతో క్రిష్ణ కు మళ్ళీ బ్రేక్ వచ్చింది .