మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. మెగాస్టార్ కు జోడీగా మొదట త్రిష సినిమాలో నటిస్తుందని ప్రకటించారు. కానీ త్రిష ఈ సినిమా నుండి తప్పుకుంది. ఆ తరవాత కాజల్ అగర్వాల్ ను సినిమాలో తీసుకున్నారు. కానీ నాలుగైదు రోజులు షూటింగ్ తరవాత కాజల్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించామని కొరటాల శివ తెలిపారు. అయితే కాజల్ తన ప్రెగ్నెన్సీ కారణంగా ఈ సినిమా నుండి తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాకు మొదటి షో నుండే నెగిటివ్ టాక్ వస్తోంది. సినిమా కొరటాల శివ రేంజ్ లో లేదని చిరంజీవి రామ్ చరణ్ లాంటి స్టార్ లు నటించిన సినిమా ఈ రేంజ్ లో ఉండదని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. సినిమాలో ఎలాంటి ఎలివేషన్ సీన్లు లేవని ప్రేక్షకులు నిరాశచెందుతున్నారు.
Advertisement
Advertisement
అంతే కాకుండా అసలు ఫ్లాప్ ఎరగని కొరటాల ఈ సినిమాకు దర్శకత్వం వహించారంటే నమ్మశక్యం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కొరటాల సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్యూలో కొరటాల హానెస్ట్ గా చెబుతున్నా..ఈ సినిమాకు నేను దర్శకత్వం చేయలేదు. రామ్ చరణ్, చిరంజీవి సీన్లు చేసుకుంటూ పోయారు అంటూ కొరటాల కామెంట్లు చేశాడు.
తాను దర్శకుడిగా రిలాక్స్ అయ్యానని కొరటాల శివ చెప్పుకొచ్చారు. అయితే వెంటనే చిరంజీవి మాట్లాడుతూ..కొరటాల చెప్పేది నిజం కాదని ఆయనకు ఏం కావాలో తాము అదే డెలివరీ చెశామని చెప్పాడు. దాంతో కొరటాల మెగాస్టార్ ల ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది.