Home » కోడి రామకృష్ణ హెడ్ బ్యాండ్ కట్టుకోవడం వెనుక నమ్మలేని నిజాలు.. ఏంటంటే..?

కోడి రామకృష్ణ హెడ్ బ్యాండ్ కట్టుకోవడం వెనుక నమ్మలేని నిజాలు.. ఏంటంటే..?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ అంటే తెలియని వారు ఉండరు. అనారోగ్యం కారణంగా కొన్నేళ్ల క్రితం ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని చెప్పడం బాధాకరం. ఇప్పటికీ ఆయన మన మధ్య లేకున్నా గాని క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఎప్పుడు ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అలాంటి కోడి రామకృష్ణ షూటింగ్ స్పాట్లోకి వచ్చారు అంటే తన తలకి హెడ్ బ్యాండ్ తప్పనిసరిగా కట్టుకుంటారు.. అయితే చాలామందికి హెడ్ బ్యాండ్ ఎందుకు కట్టుకుంటారు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. దాని వెనుక రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం..

kodi ramakrishna

also read:చంద్రబాబుకు జగన్ షాక్..ఏపీలో సభలు, ర్యాలీలు నిషేధం

Advertisement

ఆయన రెండో సినిమా షూటింగ్ కేరళ రాష్ట్రంలో జరుగుతుండగా మధ్యాహ్న సమయంలో ఎన్టీ రామారావు కు దుస్తులు సమకూర్చే వ్యక్తి సెట్ కి వచ్చారు. మీ నుదురు విశాలంగా ఉందని, ఎండకు ఎక్స్పోజ్ అవుతుందని చెప్పి తన జేబులో ఉన్న రుమాల్ తీసి తన నుదుటికి కట్టుకోమన్నారు. ఆయన చెప్పారు కదా అని రోజంతా రుమాలు కట్టుకున్నారట కోడి రామకృష్ణ. మరుసటి రోజు ఆ రుమాలును ఆయన ఒక తలకు పెట్టుకునే బ్యాండుల డిజైన్ చేసుకొచ్చారు. అది కోడి రామకృష్ణ తలకు బాగా సూట్ అయిందని చెప్పి ఎప్పుడు అలాగే కట్టుకోమని అన్నారు.

Advertisement

ఇక అప్పటి నుంచి షూటింగ్ చేసే సమయంలో ఆ బ్యాండ్ కట్టుకొని చేయడం సెంటిమెంట్ గా మార్చుకున్నాడు రామకృష్ణ. పోలీసులకు టోపీ ఎలాగో, కోడి రామకృష్ణ గారికి ఈ బ్యాండ్ తప్పనిసరి అయిపోయింది. అలాంటి కోడి రామకృష్ణ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. ముఖ్యంగా ఈయన పేరు చెప్పగానే అమ్మోరు,అంజి,దేవి పుత్రుడు, అరుంధతి లాంటి మూవీస్ టక్కున గుర్తుకు వస్తాయి. తలకి కర్చీఫ్ కట్టుకొని వైట్ అండ్ వైట్ వెరైటీ స్టైల్ గా కనిపించే వారు కోడి రామకృష్ణ. ఆయన సెట్ లోకి వచ్చి కర్చీఫ్ కట్టుకున్నారు అంటే, అక్కడున్న నటీనటులంతా రెడీ అయిపోవాలి. అలాంటి లెజెండరీ డైరెక్టర్ తెలుగు, తమిళ,కన్నడ,హిందీ వంటి భాషల్లో 100కు పైగా సినిమాలకు దర్శకత్వం చేశారు.

also read:

Visitors Are Also Reading