చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరీలపై కొడాలి నాని సెటైర్లు పేల్చారు. చంద్రబాబును దొమలు కుడుతాయన్న విషయంపై కొడాలి నాని తన స్టైల్ లో కౌంటర్ వేశారు. జైల్లో ఉంటే దొమలు కుట్టక.. రంభ, ఊర్వశీ, మేనకలు కన్ను కొడతారా..? అంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు కొడాలి నాని. చంద్రబాబు అరెస్ట్ అయితే లోకేష్ తిరునాళ్లల్లో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూశాడని… పీకండి.. కొట్టండి.. జైల్లో పెట్టండి.. నిరూపించండి అన్నాడు.. ఇప్పుడు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని చురకలు అంటించారు.
లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని.. కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది..? రాత్రికి రాత్రి 2 వేల పేజీలతో మెమోలు తయారు చేస్తారా..?అని ప్రశ్నించారు. లోకేష్ మా పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నాడు.. మేం లోకేష్ పేరు చిత్తు కాగితాల్లో కూడా రాయమని ఎద్దేవా చేశారు. ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవని ప్రకటించిన లోకేష్.. తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నాడు..? చంద్రబాబుకు పెద్ద పదవి వద్దా..? అంటూ చురకలు అంటించారు. అడెవడో స్టార్ వస్తే.. వాడిని లోకేష్ అన్నయ్య అంటాడు….ఓ పక్కన అన్నయ్యను.. మరో పక్క మామయ్యను పెట్టుకుని ఏదో చేద్దామని లోకేష్ అనుకుంటున్నాడని మండిపడ్డారు.
Advertisement
Advertisement
2 శాతం హెరిటేజ్ షేర్లు అమ్మితే కోట్లు వస్తాయని భువనేశ్వరీ అంటున్నారని…హెరిటేజ్ షేర్లు అమ్మి ప్రజలకు డబ్బులేమైనా పంచుతారా..? అని నిలదీశారు. తన భర్తకు వసతుల్లేవు.. వేణ్నీళ్లు లేవని భవనేశ్వరీ అంటున్నారు….ఏసీలు.. ఫ్రీడ్జులు.. కూలర్లు.. బెడ్స్ ఉండడానికి అదేం ఇల్లు కాదు.. జైలు అంటూ భువనేశ్వరికీ కూడా చురకలు అంటించారు కొడాలి నాని. జైల్లో ఏమైనా వసతులు కావాలంటే కోర్టును అడగాలన్నారు. చంద్రబాబు కాటికి కాలు చాపుకున్నాడు….చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నంత కాలం మాకు తిరుగు లేదని తేల్చి చెప్పారు కొడాలి నాని. చంద్రబాబు కోసం యాత్రలు చేసేది కమ్మొళ్లు మాత్రమేనన్నారు.
ఇవి కూడా చదవండి
- Babar Azam : ఇండియాకు కారులో వచ్చేసిన బాబర్.. పోలీసులు ఆపేశారుగా ?
- చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన కేటీఆర్..హైదరాబాద్ లో ర్యాలీలు తీస్తే తాట తీస్తాం !
- టీడీపీకి షాక్.. ఏ14గా నారా లోకేష్..ఇక అరెస్ట్ తప్పదా ?