ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. నాని తన సినిమా శ్యామ్ సింగరాయ్ విడుదల నేపథ్యంలో చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. నాని చేసిన వ్యాఖ్యలను వైసీపీ మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకరితరవాత మరొకరు వస్తూ నానిపై ఫైర్ అవుతున్నారు. నాని శ్యామ్ సింగరాయ్ కోసం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ….ఏపీలో థియేటర్లలో వచ్చే ఆదాయం కన్నా థియేటర్ పక్కన ఉన్న కిరాణాకొట్టు ఆదాయం ఎక్కువ అంటూ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. నాని వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు మండిపడ్డారు.
Advertisement
కాగా తాజాగా కొడాలి నాని హీరో నానికి కౌంటర్ ఇచ్చారు. కొడాలి నాని మాట్లాడుతూ..టికెట్ రేట్లను మేమెక్కడా తగ్గించలేదు. గతంలో ఉన్న విధంగానే ఉన్నాయి. కాకపోతే కోర్టు ఆదేశాల మేరకు టికెట్ రేట్లను పెంచి దోచుకునేందుకు మా ప్రభుత్వం అవకాశం కల్పించలేదు. ప్రత్యేక కమిటీని వేశాం. దాని ప్రకారంగా ప్రస్తుతం ఉన్న టికెట్ ధరల కంటే ఎక్కువ దోచుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మేము తీసుకున్న నిర్ణయంతో ఎగ్జిబిటర్ లకు ఎలాంటి నష్టం లేదు. రాష్ట్రంలో లక్ష సీట్లు ఉంటే వరకూ ఉంటే అందులో వేయ్యి కూడా పదిరూపాయల సీట్లు లేవు.
Advertisement
ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు లేదు..కావాలనే కొంతమంది ప్రభుత్వం పై భురద జల్లుతున్నారు. కిరాణా కొట్టుకు వచ్చిన ఆదాయం సినిమా థియేటర్లకు రావడం లేదని కొందరు అంటున్నారు. అంత ఆదాయం వస్తే థియేటర్ల యజమానులు కూడా కిరాణా కొట్టును పెట్టుకుంటారు కదా అంటూ కొడాలి నాని హీరో నానికి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ నెల 27న దిల్ రాజు మాట్లాడుతూ…నాని మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఏపీ సీఎంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.