Home » నేను చిరంజీవి గారిని పకోడీ గాడు అనలేదు – కొడాలి నాని

నేను చిరంజీవి గారిని పకోడీ గాడు అనలేదు – కొడాలి నాని

by Bunty
Ad

నేను చిరంజీవి గారిని పకోడీ గాడు అనలేదని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో చిరంజీవి పుట్టినరోజు కార్యక్రమాల్లో పాల్గొన్న కొడాలి నాని…కేక్ కట్ చేసి, చిరంజీవి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలని కొడాలి నాని చాలెంజ్ విసిరారు. నేను చిరంజీవి గారిని విమర్శించలేదని..చిరంజీవి మాకు సలహాలు ఇచ్చారని వెల్లడించారు. నేను కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్లకు సలహాలు ఇచ్చానని.. నాకు చిరంజీవి మధ్య టీడీపీ అగాధం సృష్టించాలని చూస్తోందని ఫైర్‌ అయ్యారు కొడాలి నాని.

Kodali Nani  Chiranjeevi

Kodali Nani Chiranjeevi

నేను శ్రీరామ అన్నా టిడిపి, జనసేనలకు బూతు మాటలుగా వినపడతాయని చురకలు అంటించారు. నేనేం మాట్లాడానో చిరంజీవికి, ఆయన అభిమానులకు తెలుసు….. తామంతా క్లారిటీ గానే ఉన్నామని వెల్లడించారు. రాజకీయంగా చిరంజీవి విమర్శిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసని… జగన్ గురించి, తమ గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడతానని హెచ్చరించారు కొడాలి నాని. ఎవరి జోలికి వెళ్ళని పెద్దయన చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును కాదని… చిరంజీవి అభిమానుల ముసుగులో, టిడిపి జనసేన శ్రేణులు గుడివాడ రోడ్లు మీద దొల్లారని మండిపడ్డారు.

Advertisement

Advertisement

చిరంజీవికి, తమకు మధ్య అగాధం సృష్టించాలని టిడిపి, జనసేన నేతలు కుట్రలు చేసారని..ప్రజారాజ్యం తరఫున తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెల్లిన….. చిరంజీవికు చేతులెత్తి నమస్కారం పెట్టానని చెప్పుకొచ్చారు. తమకు ఇచ్చినట్లే…. డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్ళకు చిరంజీవి సలహాలు ఇవ్వాలనే చెప్పానని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డాన్సులు, యాక్షన్ రాదా…. నేను ఆయన గురించి మాట్లాడినట్లు ఎట్లా అవుతుందన్నారు. తన వెంట ఉన్న వ్యక్తులు 60 శాతం చిరంజీవి అభిమానులేనని స్పస్టం చేశారు కొడాలి నాని.

ఇవి కూడా చదవండి 

రోహిత్‌ శర్మపై చాహాల్ ఫైర్…ఇకపై సూర్యుడిలా దూసుకోస్తా!

రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ…సీఎం కేసీఆర్‌ క్రేజీ ఆఫర్‌ !

NTR : ఎన్టీఆర్ చనిపోయే గంట ముందు ఇంత కథ జరిగిందా !!

Visitors Are Also Reading