Home » World Cup 2023 : పాండ్యా ఔట్…KL రాహుల్ కు కీలక పదవి

World Cup 2023 : పాండ్యా ఔట్…KL రాహుల్ కు కీలక పదవి

by Bunty
Ad

ప్రపంచకప్ లో టీమ్ ఇండియా అదరగొడుతుంది. అంచనాలకు మించి ఆడుతూ ఫేవరెట్ నుంచి హాట్ ఫేవరెట్ జట్టుగా మారిపోయింది. సమిష్టి కృషితో లీగ్ మ్యాచ్లను దాటేసి సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. టీమిండియా మరో రెండు లీగ్ మ్యాచ్లను ఆడనుంది. అయితే ఆ రెండు మ్యాచ్ ల రిజల్ట్ ఎఫెక్ట్ సెమీస్ లో బెర్త్ పై పడదు. కాబట్టి భారత్ ప్రయోగాలు చేసే అవకాశం కనిపిస్తోంది. వరుస మ్యాచులతో అలసిపోయిన విరాట్ కోహ్లీ, బూమ్రా వంటి కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. వారి స్థానంలో బెంచ్ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ లేదా పిచ్ ను బట్టి అశ్విన్ ను ఆడించే ఛాన్స్ ఉంది. కానీ వరుస విజయాలతో జోరుమీద ఉన్న టీమ్ ను విడదీయడం ఎందుకన్న సందేహాలు వెల్లు వెత్తుతున్నాయి.

KL Rahul appointed Team India’s vice-captain after Hardik Pandya is ruled out of 2023 World Cup

మరోవైపు పాండ్యా స్థానంలో ప్రసిద్ద్ కృష్ణను ఎంపిక చేస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ఇక్కడే అసలు తలనొప్పి మొదలైంది. టీమిండియా ఆడిన ఏడు మ్యాచ్లలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో అద్భుతంగా రాణించింది. పెసర్లు బుమ్రా, సిరాజ్, షమీతో పాటు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు అదరగొట్టారు. మరోవైపు బ్యాటర్లు బీకర ఫామ్ లో ఉన్నారు. ఆందోళన కలిగించిన శుబ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లు ఒక్కసారిగా గేర్లు మార్చారు. లంకపై సత్తా చాటారు. అయితే ఇన్ని రోజులు పాండ్యా లేనిలోటు ఆడపాదడపా కనిపించిన ఆ ప్రభావం జట్టుపై ఏమాత్రం పడలేదు.

Advertisement

Advertisement

ముఖ్యంగా పేస్ బుమ్రా, సిరాజ్, షమీతో చెలరేగుతుండడం జట్టుకు కలిసి వచ్చే అంశం. అయితే ఇప్పుడు ప్రసిద్ద్ కృష్ణ ఎంపిక కీలకంగా మారుతోంది. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియా లయ అద్భుతంగా కొనసాగుతోంది. ఎక్కడివారు అక్కడ సెట్ అయిపోయారు. ఈ సమయంలో ప్రసిద్ద్ జట్టులోకి వస్తే లయ దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. వన్డేలో ప్రసిద్ద్ కృష్ణ ట్రాక్ రికార్డ్ బాగానే ఉన్నా, అంతకుమించి అన్నట్లుగా ప్రస్తుతం భారత బౌలర్ల ప్రదర్శన బాగుంది. మరి ఈ కీలక సమయంలో ప్రసిద్ద్ కృష్ణ జట్టులోకి రావడం ఎలాంటి ప్రభావం ఉంటుందనేది వేచి చూడాలి. ఇక వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా వైస్ కెప్టెన్ గా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మకు డిప్యూటీగా ఉన్న హార్దిక్ పాండ్యా గాయం కారణంగా టోర్నీ నుంచి వైదోలగడంతో అతని స్థానాన్ని రాహుల్ తో బీసీసీఐ భర్తీ చేసింది.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading