తేజ హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా పెద్ద హిట్ అయింది. టాలీవుడ్ యువ హీరో తేజ నటించిన హనుమాన్ సినిమాకి ప్రశాంత వర్మ దర్శకత్వం వహించారు. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని ఈ సినిమా రాబడుతోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అయింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది హనుమాన్. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల మైలురాయిని దాటింది. మరో మార్క్ దిశగా దూసుకెళ్తోంది. ఈ సినిమాని చూసిన వాళ్ళందరూ కూడా చిత్ర యూనిట్ని, హీరోని ప్రశంసిస్తున్నారు.
Advertisement
Advertisement
తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తేజ ని అభినందించారు. తేజ కిషన్ రెడ్డి ని కలిశారు న్యూఢిల్లీ లోని ఆయన నివాసంలో కలిసిన తేజని కిషన్ రెడ్డి అభినందించారు. సినిమా సూపర్ హిట్ అవడం సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. శ్రీ రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమ సందర్భంగా భవ్య రామ మందిరానికి ప్రతి టికెట్టు నుండి రూ. 5 విరాళంగా ఇవ్వడం అభినందించి దగ్గ విషయం అని అన్నారు. తన నివాసానికి వచ్చిన హీరో తేజని కిషన్ రెడ్డి సత్కరించారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!