ఇటీవల కాలంలో వచ్చి బాక్స్ ఆఫీస్ ను దున్నేసిన సినిమాల లిస్ట్ లో కేజీఎఫ్ సినిమా కూడా ఒకటి. ఒక్కప్పుడు కన్నడ సినిమాలకు పెద్దగా మార్కెట్ ఉండకపోయేది. కన్నడలో స్టార్ హీరోలుగా చెప్పుకునే హీరోలు ఇతర భాషల్లో విలన్ పాత్రలు సైతం చేసేవారు. దాంతో కన్నడ ఇండస్ట్రీ అంటే చిన్న చూపు ఉండేది. కానీ కేజీఎఫ్ సినిమా దెబ్బతో అన్నీ మారిపోయాయి. కన్నడ సినిమాలకు ఇండియా లెవల్ లో మార్కెట్ ఏర్పడింది.
Advertisement
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా కథ స్క్రీన్ ప్లే హీరో ఎలివేషన్స్ ఇలా ప్రతి ఒక్కటి ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. అయితే అచ్చం ఇలాంటి సినిమాలోనే మెగాస్టార్ చిరంజీవి ముప్పై ఆరేళ్ల క్రితమే నటించాడు అన్న సంగతి చాలా మందికి తెలియదు. కొన్ని సినిమాలు చూస్తుంటే ఇలాంటి సినిమా ఎక్కడో చూసామే అన్నట్టుగా కొన్ని చిత్రాలు గుర్తుకు వస్తాయి.
Advertisement
అలానే కేజీఎఫ్ సినిమా లాంటి సినిమా చిరంజీవి కెరీర్ లో ఒకటి ఉంది. ఆ సినిమా మరేదో కాదు రాక్షసుడు సినిమా. కేజీఎఫ్ సినిమాలో యష్ కు తల్లి మాత్రమే ఉంటుంది. అదే విధంగా రాక్షసుడు సినిమాలో కూడా వితంతు మహిళ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ ఊరి పెద్ద దానిని ఆమోదించక బిడ్డను పారేయగా ఓ తాగుబోతు చేతికి దొరుకుతాడు. ఆ తాగుబోతు అబ్బాయిని పెంచి లేబర్ క్యాంప్ కు విక్రయించాలని చూస్తాడు.
కానీ అతడు తన తల్లిని వెతుకున్నేందుకు వెళతాడు. అక్కడ యజమాని మీ తల్లి పారిపోయిందని దానికి తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. కాగా హీరో ఎలా ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడు. తన తల్లిని ఎలా చేరుతాడు అన్నదే సినిమా కథ. అయితే సినిమా కథ అటూ ఇటూగా ఉన్న టేకింగ్ మాత్రం కేజీఎఫ్ మాధిరగానే ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది.